Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆసుపత్రుల్లో డా.శశి పెట్టుబడి: రాత్రికి రాత్రే ట్విస్ట్, తెరపైకి కొత్త వ్యక్తులు (పిక్చర్స్)

హైదరాబాద్: రెండు రోజుల క్రితం హైదరాబాదులో డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు, డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య సంచలనం రేపింది. ఈ కేసును పోలీసులు దాదాపు చేధించారు. ఉదయ్ పైన కాల్పులు జరిపింది శశికుమారేనని నిర్ధారించారు.

ఆత్మహత్య చేసుకున్న శశికుమార్‌కు చైతన్యపురిలో సాయినికేతన్ ఆసుపత్రి ఉందని తెలుస్తోంది. అక్కడే ఉదయ్ కుమార్, సాయి కుమార్‌లు అనస్తెటిస్టులుగా పని చేశారు. డాక్టర్ శశికుమార్ మరిన్ని ఆసుపత్రులలో పెట్టుబడులు పెట్టనట్లుగా తెలుస్తోందని అంటున్నారు.

అనంతరం డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ ఉదయ్ కుమార్‌లు మాదాపూర్లో ఆసుపత్రి స్థాపించారు. అందులో శశికుమార్ కూడా పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు, వీరు ఆఫ్రికాలోను ఆసుపత్రి పెట్టాలని ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు.

సోమవారం నాటి ఘటన అనంతరం పోలీసులు లారెల్ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల పైన విచారణ చేయాలని భావిస్తున్నారు. మాదాపూర్లోని లారెల్ ఆసుపత్రిలో ఈ ముగ్గురు డాక్టర్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, తనను పక్కకు జరపాలని మిగతా వారు భావించినట్లుగా శశికుమార్‌ భావించారు. దీంతో ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. అనంతరం శశికుమార్ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

చంద్రకళ

చంద్రకళ

హిమాయత్‌నగర్‌ వీధి నెంబర్ 6లోని కారులో జరిగిన కాల్పుల ఘటన సోమవారం అర్ధరాత్రికే అనూహ్యంగా మలుపు తిరిగింది. కొత్త వ్యక్తులు చంద్రకళ, శంకరయ్య, మొయినాబాద్‌ సమీపంలోని నక్కలపల్లి ఫామ్‌హౌస్‌లు ఈ కేసులో కీలకంగా మారడంతో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించేలా ఈ ఉదంతం కొనసాగింది.

శశికుమార్

శశికుమార్

డాక్టర్‌ శశి కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తుండగా, ఆయన భార్య మాత్రం ఇది కచ్చితంగా హత్య అని చెబుతున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ పోలీసులు మాత్రం నిందితుడిగా భావించిన వ్యక్తి చనిపోవడంతో కేసు దాదాపుగా పరిష్కారమైందంటున్నారు.

శశికుమార్

శశికుమార్

కాల్పుల ఘటన, శశికుమార్‌ మృతి రెండింటికీ సంబంధం ఉన్నా, ఈ రెండు ఘటనల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయని, ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

శశికుమార్

శశికుమార్

శశికుమార్‌ నేరుగా పంజాగుట్టలోని తన స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఆమె ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ఎందుకు వచ్చావని చంద్రకళ ప్రశ్నించలేదా? శశికుమార్‌ను ఫామ్‌హౌస్‌లో వదిలేసి చంద్రకళ ఇంటికి వచ్చారు. సుమారు రెండుగంటల తర్వాత అంటే.. రాత్రి 10 గంటల ప్రాంతంలో శశికుమార్‌ ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. అప్పటి వరకూ ఆమెకు విషయం తెలియదా? చంద్రకళ పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు రాత్రి 10.10 గంటలకు వచ్చారు.

సాయి కుమార్

సాయి కుమార్

అక్కడ ఇరవై నిమిషాలున్నారు. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ భీంరెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీసులు, భీంరెడ్డి, చంద్రకళ వాహనాల్లో వెళ్లారు. అక్కడి వెళ్లేసరికి సుమారు రెండుగంటలు పట్టింది.

శశికుమార్

శశికుమార్


డాక్టర్‌ శశికుమార్‌ సూసైడ్‌ నోట్‌లో డాక్టర్‌ కేకే రెడ్డి, ఓబుల్ రెడ్డి, రామారావు, సాయికుమార్‌, చెన్నారెడ్డి, ఉదయ్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని రాశాడు, తనతో ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. దీంతో, అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

చైతన్యపురిలోని ఆసుపత్రి

చైతన్యపురిలోని ఆసుపత్రి

సోమాజిగూడకు చెందిన చంద్రకళ నక్కలపల్లి గ్రామంలో అంజయ్యకు చెందిన 2.2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఫాంహౌస్‌ను ఏర్పాటు చేశారు. పండ్ల తోటతోపాటు ఓ పక్కన నివాసం ఉండేందుకు కంటైనర్‌తో రెండు గదులను నిర్మించారు. అక్కడే శశికుమార్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.

చైతన్యపురిలోని ఇల్లు

చైతన్యపురిలోని ఇల్లు

అతడి మృతదేహం పక్కనే రివాల్వర్‌తోపాటు కొడవలి, రంపం, తాడు ఉండటాన్ని బట్టి బలవన్మరణానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య లేఖ రాసిన అనంతరం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో శశికుమార్‌ చివరిసారిగా తన భార్య కాంతికి ఫోన్‌ చేసి సారీ అని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.

శశికుమార్

శశికుమార్

శశికుమార్‌ చైతన్యపురి పోలీస్ స్టేషన్ నుంచి 0.32 రివాల్వర్‌ లైసెన్స్‌ పొందారు. 2012 ఆగస్టులో ఆత్మరక్షణ కోసం రివాల్వర్‌ లైసెన్స్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వైద్యుడిని కావడం వల్ల ఆర్థిక లావాదేవీలతో రివాల్వర్‌ అవసరమని దరఖాస్తులో పేర్కొన్నారు.

శశికుమార్ సతీమణి కన్నీరుమున్నీరు

శశికుమార్ సతీమణి కన్నీరుమున్నీరు

విచారణ అనంతరం అదే ఏడాది చివర్లో లైసెన్స్‌ మంజూరైంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో జనవరి 22న ఆయుధాన్ని నాంపల్లిలోని మారూఫ్‌ ఆర్మరీలో డిపాజిట్‌ చేశారు. ఎన్నికల నియమావళి ముగియడంతో పోలీసుల నుంచి అనుమతి పొందిన ఈ నెల 6న రివాల్వర్‌ను ఆర్మరీ నుంచి తిరిగి తీసుకున్నారు. కాగా, శశికుమార్‌ది హత్యేనని ఆయన భార్య ఆరోపిస్తున్నారు.

శశికుమార్ ఇంటి వద్ద విషాదం

శశికుమార్ ఇంటి వద్ద విషాదం

శశి కుమార్‌కు చైతన్యపురిలోని జైన్‌మందిర్‌ సమీపంలో సాయినిఖిత్‌ ఆసుపత్రి సొంతంగా ఉంది. ఇటీవలే దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆసుపత్రిలో భాగస్వామ్యం తీసుకున్నారు. స్థానికంగా మంచి వైద్యుడిగా పేరున్న శశికుమార్‌ మృతి చైతన్యపురిలో విషాదాన్ని నింపింది.

శశికుమార్ ఇంటి వద్ద విషాదం

శశికుమార్ ఇంటి వద్ద విషాదం

శశికుమార్‌ కూతురు దక్కన్‌ వైద్య కళాశాలలో మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా కొడుకు మలక్‌పేటలోని ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారని తెలుస్తోంది. నా భర్త శశికుమార్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని.. శశికుమార్ సతీమణి ఆరోపిస్తున్నారు.

శశికుమార్ ఇంటి వద్ద విషాదం

శశికుమార్ ఇంటి వద్ద విషాదం

ఇద్దరు వైద్యులతోపాటు వారి అనుచరులు కిరాయి హంతకులు నా భర్తను కిడ్నాప్‌ చేసి ఫామ్‌హౌస్‌లో పిస్టల్‌తో కాల్చి చంపారని ఆమె ఆరోపించారు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కట్టుకథలు అల్లుతున్నారు. ఏడాదిన్నర కాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు నడుస్తున్నాయని, పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+