తాగి రోడ్డెక్కింది.. పోలీసులు ఆపినందుకు.. నానా రచ్చ చేసింది..
వీకెండ్ నేపథ్యంలో.. శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఓ యువతిని కారు ఆపాల్సిందిగా కోరగా.. వారిపైనే రంకెలు వేసింది.
హైదరాబాద్ : పీకలదాకా తాగి కారుతో రోడ్డెక్కిన యువతి నానా రచ్చ చేసింది. డ్రంక్ డ్రైవ్ టెస్టు కోసం పోలీసులు ఆమె కారును ఆపగా.. వారి పైకే తిరగబడింది. స్నేహితులతో కలిసి పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించడమే గాక, తనను ఎలా ఆపుతారంటూ రెచ్చిపోయింది.

వీకెండ్ నేపథ్యంలో.. శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఈ అనుభవం ఎదురైంది. కారులో వేగంగా దూసుకెళుతున్న యువతిని ఆపి శాంపిల్ ఇవ్వాల్సిందిగా కోరగా.. అందుకు నిరాకరించడమే గాక పోలీసులపై దుర్భాషలాడినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా, శుక్రవారం నాడు ఒక్కరోజే 149మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు కేసులు నమోదు చేశారు. వాహనాలను సైతం సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications