వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాజీపేట జంక్షన్ మీదగా నడిచే పలు రైళ్లు ఆలస్యం, మరికొన్ని రద్దు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కాజీపేట జంక్షన్ మీదగా నడిచే పలు రైళ్లు ఆలస్యంగా, మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా కాజీపేట జంక్షన్ నుండి ఇఠార్సీ రైల్వేస్టేషన్ సమీపంలో ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌లో జరిగిన ప్రమాదంతో సిగ్నల్ వ్యవస్థకు సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దుచేసింది.

దీంతో కాజీపేట జంక్షన్ మీదగా వెళ్లే న్యూఢిల్లీ-హైదరాబాద్ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు, విశాఖపట్నం-లోకమాన్యతిలక్ టెర్మినల్ స్టేషన్‌ల మధ్య నడిచే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచినట్లు తెలిపారు.

వీటితో పాటు భాగ్యనగర్, కృష్ణా, కోణార్క్, హౌరా తదితర రైళ్లు కొద్దిపాటి ఆలస్యంతో నడిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Due to rains trains were delayed and canceled

రద్దైన రైళ్లు:

హాజరత్ నిజాముద్దీన్-కోయంబత్తూర్‌ (కొంగో ఎక్స్‌ప్రెస్)
పాట్నా-సికింద్రాబాద్‌ (పాట్నా ఎక్స్‌ప్రెస్)
యశ్వంతపూర్-లక్నో (జదల్‌పూర్ ఎక్స్‌ప్రెస్)
భవనేశ్వర్-ముంబై (కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌)

English summary
Due to rains trains were delayed and canceled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X