హైదరాబాద్ లో దుర్గామాత మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి.. పోలీసులు కీలక ప్రకటన

హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండగల్లో దసరా ఒకటి. ఏటా ఈ నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, పూజలు నిర్వహిస్తారు. అయితే 2026 సంవత్సరంలో దేవీ నవరాత్రులు అక్టోబర్ 11వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11న బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

అలాగే అక్టోబర్ 12న గాయత్రీ దేవి, అక్టోబర్ 13న అన్నపూర్ణాదేవిగా భక్తులను ఆశీర్వదించనున్నారు. ఇక అక్టోబర్ 14న లలితా త్రిపుర సుందరీ దేవి, అక్టోబర్ 15న చండీ దేవి, అక్టోబర్ 16న మహా లక్ష్మీదేవి ఆరాధన ఉంటుంది. అలాగే అక్టోబర్ 17న సరస్వతీదేవి, అక్టోబర్ 18న దుర్గాదేవి, అక్టోబర్ 19న మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. ఇక చివరి రోజు మహానవమి కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, హోమాలు చేస్తారు. నవరాత్రుల అనంతరం అక్టోబర్ 20న దసరా పండుగను జ‌రుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

DurgaMata pandal sett up Hyderabad Key announcement from the police advice to apply in advance

అయితే హైదరాబాద్ మహా నగరంలో ఏటా పలు ప్రాంతాల్లో దుర్గా మాతా మండపాలను ఏర్పాటు చేసి 9 రోజులపాటు పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో నగరంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాల ప్రతిష్ఠాపన.. శోభాయాత్ర అలాగే నిమజ్జన కార్యక్రమాల కోసం పోలీసు శాఖ ఆన్‌ లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. తమ కాలనీలు, ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు పోలీసు శాఖ అధికారిక పోర్టల్ అయిన https://policeportal.tspolice.gov.in ద్వారా ముందుగానే తమ వివరాలను సమర్పించి, రిజిస్టర్ రశీదు పొందాలని సూచించారు. ఇటీవల పూర్తి అయిన గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా పోలీసులు ఇలాంటి సదుపాయాన్నే కల్పించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా.. సురక్షితంగా జరిగేలా చూసేందుకు మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు సమాచారం ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+