కేసీఆర్‌పై తిరుగుబాటు: ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌పై తిరుగుబాటు.. గుజరాత్‌తోపాటు ఎన్నికలు: రేవంత్
హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందన్నారు. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు రేవంత్. 2022 ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతోపాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు.

కేసీఆర్ ముందస్తు వ్యాఖ్యలు అందుకేనంటూ రేవంత్
ప్రభుత్వంని నడిపించాల్సిన సమయంలో పార్టీ మీద కేసీఆర్ దృష్టి పెట్టడానికి కారణం ముందస్తు ఎన్నికలకు పోవడానికే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు విజయ ఘర్జన సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీ మీద పట్టుకోల్పోతున్నాననే భయం ఆయనలో ఉంది. బీజేపీ కూడా కేసీఆర్‌కి సహకరించేందుకు హామీ ఇచ్చింది. అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ వరస మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత పార్టీలో తిరుగుబాటు వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో బీజేపీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు.

మిత్ర ద్రోహిగా హరీశ్.. కేసీఆర్ ఇంటికే పంపిస్తారు..
ఆర్థిక మంత్రి హరీశ్ రావు మిత్ర ద్రోహిగా మిగిలిపోతారని రేవంత్ వ్యాఖ్యానించారు. హరీశ్ రావును పూర్తిగా ఇంటికి పంపించే ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రెండేళ్ల ముందే కేసీఆర్ ఎలా చెప్తారని రేవంత్ ప్రశ్నించారు. అడక్కుండానే దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఆశ చూపి మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియలో ఒక్క దళిత నేతను కూడా భాగస్వామిని చేయలేదన్నారు. కేసీఆర్‌తో వేదిక పంచుకోవడానికి ఎంపీ రాములు, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్ లాంటి వాళ్లు పనికిరారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ దళితుడుని నమ్మడు.. దళితులు కేసీఆర్‌ని నమ్మరు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దళిత బంధును ఎవరు వ్యతిరేకించలేదన్నారు రేవంత్ రెడ్డి.
Recommended Video

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఎమన్నారంటే..
కాగా, ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల పైనా తేల్చేశారు. ఈ సారి మనం ముందస్తు ఎన్నుకలకు వెళ్లడం లేదంటూ కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని.. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్ట పడి పనిచేయండంటూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇక, ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల పైన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామంటూ పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, అక్టోబర్ 27 హుజురాబాద్‌లో కేసీఆర్ ప్రచార సభ జరగనుంది.












Click it and Unblock the Notifications