హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచలనం: ముందస్తుకే కేసీఆర్, సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దు? వారికి టిక్కెట్లు నో, వరాల వర్షం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసన సభా పక్ష సమావేశంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు అనే విషయాన్ని తనకు వదిలేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలతో చెప్పారు.

ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చునని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. హైదరాబాద్ మొత్తం మనమే గెలుస్తున్నామని తెలిపారు. ప్రగతి నివేదన సభకు నియోజకవర్గం నుంచి 25వేల మందిని తరలించాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పారు.

ముందస్తుకే కేసీఆర్ మొగ్గు

ముందస్తుకే కేసీఆర్ మొగ్గు

కేసీఆర్ తీరును చూస్తుంటే ముందస్తు ఎన్నికలకే సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్‌కు కూడా ఆయన సంకేతాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు డిసెంబర్ ముహూర్తంపై చర్చించారని తెలుస్తోంది. డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్తే కనుక సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దయ్యే అవకాశముంటుంది.

100 నియోజకవర్గాల్లో 50 రోజుల్లో ప్రచారం

100 నియోజకవర్గాల్లో 50 రోజుల్లో ప్రచారం

కేసీఆర్ వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ 100 నియోజకవర్గాల్లో 50 రోజులు ప్రచారం చేయనున్నారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ముగ్గురు నలుగురి పరిస్థితి ఏమాత్రం బాగా లేదని చెప్పారు. వారికి వేరే పదవులు ఇస్తామని చెప్పారు. టిక్కెట్లు మాత్రం ఇచ్చేది లేదని చెప్పారు. కాగా, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని తదితరులను కలవనున్నారు.

వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

పార్టీ నేతలతో ప్రజలకు ఇచ్చే వరాలపై కూడా కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ప్రస్తుతం 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉంది. ఇళ్లలో వాడకం పెరిగినందున తాజాగా ఈ నిర్ణయం. ఇందుకు అయ్యే ఛార్జీలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది.

అర్చకులకు, ఇమాంలకు వరాలు

అర్చకులకు, ఇమాంలకు వరాలు

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు నేరుగా వేతనాలు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు. పూజారుల పదవీ విరమణ పరిమితి 58 నుంచి 65కు పెంపు. జీతాల చెల్లింపులు, పదవీ విరమణపై సోమవారం ఉత్తర్వులు. ఇమామ్, మౌసంలకు నెలకు రూ.5వేల భృతి. సెప్టెంబర్ నుంచి అమలు చేస్తారు. రాష్టంలో 9వేల మందికి లబ్ధి చేకూరుతుంది.

వేతనాలు పెంపు

వేతనాలు పెంపు


రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల ఉద్యోగులకు వేతనాలు పెంపు. హెచ్ఎం, వార్డెన్‌కు రూ.5వేల నుంచి రూ.21 వేల వరకు పెంపు. సీఆర్టీలకు రూ.4వేల నుంచి రూ.15 వేల వరకు పెంపు. పీఈటీలకు రూ.4వేల నుంచి రూ.11వేల వరకు పెంపు. అకౌంటెంట్‌కు రూ.3500 నుంచి రూ.10వేల వరకు పెంపు. ఏఎన్ఎంలకు రూ.4వేల నుంచి రూ.9వేల వరకు పెంపు. వంటమనిషి, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్‌మెన్‌లకు రూ.2500 నుంచి రూ.7500 వరకు పెంపు.

English summary
Even as speculation is rife that the Telangana government wants the Election Commission to conduct early polls, Chief Minister K Chandrashekhar Rao is all set to leave for New Delhi, accompanied by senior officers on Friday Evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X