టీఆర్ఎస్‌కు ఈసీ షాక్: కొడంగల్ అభ్యర్థికి నోటీసులు, హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం
సిద్దిపేట/కొడంగల్: కొడంగల్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. బుధవారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రూ.51 లక్షల నగదు దొరికింది. సోదాల్లో దొరికిన నగదుపై వివరణ ఇవ్వాలని ఈసీ అడిగింది. నరేందర్ రెడ్డి బంధువు ఫాంహౌస్‌లోను సోదాలు నిర్వహించారు.
అంతకుముందు తెలంగాణ సీఈవో రజత్ కుమార్ మాట్లాడారు. పట్నం నరేందర్ రెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. రూ.51 లక్షలు పట్టుబడ్డాయని అన్నారు. రూ.50వేలకు పైగా డబ్బులకు ఆధారాలు చూపకుంటే సీజ్ చేస్తామని చెప్పారు. ఎన్నికలు ఉన్నందున డిసెంబర్ 7వ తేదీన ఐటీ కంపెనీలకు సెలవులు ఇస్తారని చెప్పారు.

మరోవైపు, మంత్రి హరీష్ రావుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సిద్దిపేట కలెక్టర్‌కు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. హరీష్ నిబంధనలు ఉల్లంఘించారని సిద్దిపేట డీఈవోను ఆదేశించారు.
ఆర్యవైశ్య సంఘం సమావేశంలో హరీష్ రావుకు సన్మానం సమయంలోని సీడీలు, ఫోటోల వివరాలను ఆధారంగా తీసుకొని చర్యలు తీసుకున్నట్లుగా ఈసీ చెబుతోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications