సీఎం కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నేతల వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న లగ్జరీ బస్సును ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం తనిఖీ చేశారు.
ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు కొత్తగూడెంకు కేసీఆర్ వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న 'ప్రగతిరథం బస్సు'ను ఈసీ అధికారులు పోలీసుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అధికారులు, పోలీసు సిబ్బంది ప్రతి మూలను తనిఖీ చేశారు. బ్యాగులు, బుట్టలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే పెట్టెలను కూడా తెరిచి చూశారు. వాహనంలో ఉన్న టాయిలెట్స్ కూడా తనిఖీ చేశారు.

తనిఖీలు చేస్తుండగా సంబంధిత అధికారులు వీడియో రికార్డు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించారు. తనిఖీకి సహకరించిన కేసీఆర్‌కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఆదివారం సీఎం కేసీఆర్ కొత్తగూడెం, ఖమ్మం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
#Telangana CM #KCR 's vehicle was searched by Election officials at Kothagudem, during his election campaign in the constituency, as part of vehicles checking in view of Telangana Assembly Elections.#Kothagudem#TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 pic.twitter.com/KTFkmdy0LN
— Surya Reddy (@jsuryareddy) November 5, 2023
మరోవైపు, ఇతర రాజకీయ ప్రముఖుల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం కామారెడ్డి వెళుతున్న సమయంలో ఆయన కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనాలను కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications