ఎన్నికల ఖర్చు అకౌంట్‌లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణ
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన పేరుతో బ్యాంకు ఖాతాను తెరువాలని పేర్కొంది. అలాగే ఎన్నికల సమయంలో చేసే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే చేయాలని సూచించింది.
ఫొటో జతచేయడం మరవొద్దు ..
నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి కొత్త ఫొటోను జతచేయాలని ఈసీ స్పష్టంచేసింది. ఆ ఫోటో మూడునెలల్లోపే తీసిందై ఉండాలని పేర్కొంది. నామినేషన్‌తోపాటు విధిగా అఫిడవిట్ పొందుపర్చాలని పేర్కొన్నది.

జనరల్ రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ 12,500 వేలు
నామినేషన్‌తోపాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ రూ.25 వేల నగదు లేదా చలానా రూపేణా సమర్పించాలని కోరింది. ఒకవేళ అభ్యర్థి ఎస్పీ, ఎస్టీ వర్గానికి చెందినవారైతే 12 వేల 500 డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ విధిగా చూపించాలని షరతు విధించింది.












Click it and Unblock the Notifications