జూబ్లీహిల్స్ పోలింగ్ వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!!
జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రచారం చివరి దశకు చేరటంతో హోరా హోరీగా నేతలు కొనసాగిస్తున్నారు. సర్వే నివేదికలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ క షాక్ గా మారుతున్నాయి. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ లో పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.
జూబ్లీహిల్స్ లో ఆదివారం సాయంత్రంతో ప్రచారం పూర్తి కానుంది. చివరి దశకు చేరుకున్న ప్రచారం తో ప్రధాన పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్య నేతలు బరిలోకి దిగారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాటల యుద్దం కొనసాగుతోంది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్.. మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లో గెలుపు ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సర్వే నివేదికల ఆధారంగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూనే కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ది కోసం పని చేస్తున్న ఆ పార్టీ ముఖ్య నేతల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం బీఆర్ఎస్ లో కలకలంగా మారింది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసాల్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగదు నిల్వ చేసారనే ఫిర్యాదులతో ఈ సోదా లు చేస్తున్నట్లు సమాచారం. మోదీ నగర్ లోని జనార్ధన్ రెడ్డి నివాసంతో పాటుగా కుకట్ పల్లిలోని రవీందర్ రావు ఇంటిలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, జూబ్లీహిల్స్ పరిధిలో లేని తమ ఇళ్లల్లో సోదాలు ఎలా చేస్తారని రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు. జనార్ధన్ రెడ్డి తనను ఇంటిలోకి వెళ్లనీయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పార్టీ కార్యకర్తలు ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్దకు చేరుకున్నారు. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న సోదాలుగా ఆరోపిస్తున్నారు. కాగా, మంత్రి పొన్నం మాత్రం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. ఎవరి విధులు వారు నిర్వహిస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ సోదాల్లో ఏం తేల్చుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక.. ప్రచారం ముగిసే వేళ ప్రధాన పార్టీల ముఖ్య నేతలు తమ జోరు పెంచుతున్నారు. ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ లో ఎన్నికల వేడి మరింతగా పెరగనుంది.












Click it and Unblock the Notifications