తెలంగాణలో ఎన్నికల వేడి.!అస్త్రాలు సిద్దం చేసుకుంటున్న ఆశావహులు.!షేరిలింగంపల్లి షేర్ ఎవరు.?z
హైదరాబాద్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలలో పరోక్షంగా నియోజకవర్గాల పరిస్ధితులు, గెలుపుగుర్రాల ఎంపిక ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది. రాబోవు ఎన్నికల పోటీలో నిలబడి గెలుపు కైవసం చేసుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని కలలు కంటున్న ఆశావహులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ పరిధిలో ఉండే మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉండే షేరిలింగంపల్లి నియోజకవర్గం మీద ఆశావహులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్ధులుగా దరఖాస్తు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ పరిధిలో కీలక నియోజకవర్గం..
భిన్న సంస్కృతుల సమాహారంగా, అనేక రకాల వ్యాపార కేంద్రంగా, రియల్ ఎస్టేట్ హబ్ గా, ఐటీ పార్క్ గా, సినిమా షూటింగులకు నిలయంగా షేరిలింగంపల్లి నియోజకవర్గం మంచి గుర్తింపుపొందింది. ఇది కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం, 2009 సాధారణ ఎన్నికలకు ముందు ఏర్పడింది. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం, ఇది ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి విడదీయబడిన నియోజకవర్గం. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాలు షేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్న అతి పెద్ద అసెంబ్లీ నియోజక వర్గం కూడా ఇదే కావడం విశేషం.

పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి..
తాజా రాజకీయాలతో షేరిలింగంపల్లి నియోజకవర్గం వేడెక్కింది. 2014లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందిన అరికెపూడి గాంధీ కొద్ది రోజులకే అధికార గులాబీపార్టీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు సాధారణ ఎన్నికల్లో కూడా ఆయనే గులాబీ పార్టీ తరుపున గెలుపొందారు. దీంతో ప్రతిపక్ష పార్టీ ఐన కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపి కూడా ఈ సారి షేరిలింగంపల్లి నియోజక వర్గం మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ సారి సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. అతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా షేరిలింగంపల్లిని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు
రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టినప్పటినుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అనుకూలంగా ఉండే నియోజక వర్గాలతో పాటు తటస్థంగా ఉండే నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను శోధిస్తున్నారు రేవంత్ రెడ్డి. గతంలో ఇదే షేరిలింగంపల్లి నియోజక వర్గంలో కీలక చక్రం తిప్పిన బండి రమేష్ కు ఈ సారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా రమేష్ ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఐటీ విభాగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చి అదిష్టానం ప్రశంసలు అందుకున్న మన్నే సతీష్ కూడా షేరిలింగంపల్లి టికెట్ ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు దరఖాస్తు కూడా చేసుకున్నారు.

షేరిలింగంపల్లి పోటీ రసవత్తరం..
మన్నే సతీష్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా వ్యవహరిస్తున్నారు. షేరిలింగంపల్లి నియోజక వర్గంలో మన్నే సతీష్ సామాజిక వర్గం ఐన కమ్మ ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ ఓట్లను ఆకర్షించొచ్చనే ధీమాను సతీష్ వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఐటీ సెక్టార్ నెలకొంటున్న తొలిరోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న మన్నే సతీష్ ఐటీ కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులతో కూడా సత్సంబాధాలు కొనసాగించారు. తాను షేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోటీలో నిలబడితే ఐటీ సెక్టార్ ప్రజానికం కూడా తనకు అండగా నిలుస్తారనే భరోసా వ్యక్తం చేస్తున్నారు మన్నే సతీష్. ఇందుకోసం ఆయన ఇప్పటినుంచే క్షేత్ర స్దాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తోంది. దీంతో అటు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపి అభ్యర్థుతో షేరిలింగంపల్లి పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications