నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్..

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రత, లాజిస్టిక్స్, పోలింగ్ ఏర్పాట్లపై చర్చించిన అనంతరం షెడ్యూల్‌ను ప్రకటించారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమైనవని, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల కమిషనర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

elections-for-municipalities-notification-in-telangana-released-by-the-sec-and-nominations-from-toda

నేటి నుంచే నామినేషన్స్..

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అర్హులైన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత తుది బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల అవుతుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఓటింగ్ పూర్తైన వెంటనే లెక్కింపు ప్రారంభించి ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ విజయానికి కొనసాగింపుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచి తొలి స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు రెండో స్థానాన్ని, బీజేపీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ ఫలితాలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వేగవంతం చేశారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పనులు నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే:

నామినేషన్ల ప్రారంభం: 28-01-2026 (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు)

నామినేషన్ల ముగింపు: 30-01-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)

నామినేషన్ల పరిశీలన: 31-01-2026

నామినేషన్ల ఉపసంహరణ గడువు: 03-02-2026 (మధ్యాహ్నం 3:00 గంటల వరకు)

పోలింగ్ తేదీ: 11-02-2026 (ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 వరకు)

ఓట్ల లెక్కింపు: 13-02-2026 (ఉదయం 8:00 గంటల నుంచి)

ఫలితాల ప్రకటన: లెక్కింపు పూర్తయిన వెంటనే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+