ఇక సుదూర ప్రయాణం హాయిగా చేయొచ్చు.!యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు.!

హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపిస్తోంది. చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణం కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వివిధ ఉత్పాదక రంగాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను, రాయితీలను ప్రకటించింది. వీటితో పాటు వాహనాలకు సుదూర ప్రయాణంలో ఛార్జింగ్ సమస్యలను అధిగమించేందకు వేగవంతమైన చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా దేశంలోని చమురు కంపెనీలు మొదటి దశలో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలతో పాటు జాతీయ రహదారులపై మిషన్ మోడ్‌లో ఇరవై రెండు వేల ఎలక్ట్రిక్ వాహనా ఛార్జింగ్ స్టేషన్లను (EV Charging station) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

Electric vehicle charging stations on a war footing.!

ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పది వేల స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇది ఇప్పటికే 439 EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసింది. మరియు వచ్చే సంవత్సరంలో దాని రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్‌లో రెండు వేల ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 7,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా అందులో 1000 EV ఛార్జింగ్ స్టేషన్లు వచ్చే ఏడాదిలోగా ఏర్పాటు చేయనున్నది. భారత పెట్రోలియం సంస్థ ఇప్పటికే 52 స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 382 ఈవీ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేసిన హెచ్‌పీసీఎల్ వచ్చే ఏడాది 1000 స్టేషన్లు, మొత్తం 5000 స్టేషన్లను ఏర్పాటు చేయనుందని సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+