హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంగళవారం హైదరాబాద్‌లో కురిసిన వర్షం ఒకరి ప్రాణం తీసింది. జోరున కురిసిన వర్షానికి ఓ సికింద్రాబాద్‌లోని ఓ పురాతన భవనం పై కప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శివాజీనగర్‌కు చెందిన డి.గోపాల్‌ (58) సంతోష్‌ ఎలక్ట్రానిక్స్‌ అనే దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.

ఈ భవనం చాలా పురాతనమైంది. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి భవనం పూర్తిగా తడిచిపోయింది. అయితే మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో భవనం పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో యాజమాని గోపాల్‌ షాపులోనే ఉండటంతో ఆ శిధిలాల కింద చిక్కుకుపోయాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, 108 సిబ్బంది, స్థానికులు శ్రమించి 9గంటలకు అతడిని బయటకు తీశారు. వెంటనే గోపాల్‌నుచికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

అయితే అప్పటికే గోపాల్‌ మృతి చెందినట్లు చికిత్సను అందించిన వైద్యులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ఈ విషయాన్ని తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, స్థానిక కార్పొరేటర్‌ ఆకుల రూపలు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటన గురించి తెలుసుకున్నారు.

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌ మాట్లాడుతూ భవనం పై కప్పు కూలిన విషయమై విచారణ చేపట్టామని తెలిపారు. భవనం పై కప్పు కూలడంపై అధికారులు, యాజమాన్యం తప్పదమా అనే కోణంలో విచారణ కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ఇదిలా ఉంటే శిథిలావస్తుకు చేరిన భవనాన్ని తొలగించాలని కోరుతూ జీహెచ్ఎంసీ గతంలోనే నోటీసులు జారీ చేసింది.

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

యజమానులు స్పందించకపోవడంతో అలాగే వదిలేసినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనానికి నోటీసులు ఇచ్చామని యజమానులు ముందుకు రాకవపోవడంతో తొలగించలేదన్నారు.

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

ప్రాణం తీసిన వర్షం: భవనం పై కప్పు కూలి ఒకరు మృతి

కాగా మంగళవారం కుప్పకూలిన భవనం సుమారు 70 సంవత్సరాలదని స్థానికులు చెబుతున్నారు. పక్కనే రావి చెట్టు, నీళ్లు ఉండటంతో వర్షపు నీరు నిల్వ ఉండి భవనం నాని కూలిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

English summary
A 50-year-old electrician from Secunderabad died when the roof of his dilapidated shop collapsed due to heavy rain on Tuesday. The deceased has been identified as Gopal, a resident of Secunderabad and has ‘Santosh Electronics’ shop at Shivaji Nagar. He was working in the shop when the roof collapsed around 8.15 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X