హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిటీలో ట్రాఫిక్‌పైఅధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.

హైదరాబాద్ నగరంలో రోజుకు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రధాన రహదారులతోపాటు కాలనీల్లోనూ ట్రాఫిక్ జాం అవుతోంది. ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

Employment of transgender as traffic volunteers CM Revanth Reddy

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించాలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్ అండ్ బీ టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను 15 రోజుల్లోగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పుడు రిపోర్టులు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

14 నుంచి ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

సైబర్ టవర్స్ నుంచి యశోద ఆస్పత్రి వరకు రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సెప్టెంబర్ 14 నుంచి 30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ లేకుండా వెళ్లాలంటే వేరే రూట్లలో వెళ్లాలని సూచించారు. టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ పర్వతనగర్ జంక్షన్ దగ్గర టర్న్ తీసుకుని ఖైత్లాపూర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+