వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: మావోయిస్టు మృతులు వీరే, ఓ మహిళా డాక్టర్ కూడా

By Pratap
|
Google Oneindia TeluguNews

భద్రాచలం: తెలంగాణలోని చర్ల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణంచిన మావోయిస్టులను పది మంది పేర్లు చెబుతున్నారు . మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు మొదట భావించినప్పటికీ ఏడుగురు మహిళలు ఉన్నట్లు తాజా తేలింది.

Recommended Video

Encounter : Ten Maoists And A Constable Lost Life

ఎదురు కాల్పుల్లో ఏడుగురు మహిళా నక్సలైట్లు మరణించడం బహుశా ఇదే తొలిసారి. నక్సలైట్ మృతదేహాలకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆలస్యంగానే పోస్టుమార్టం నిర్వహణ ప్రారంభమైంది.

 మృతుల్లో అగ్రనేతలు లేరు...

మృతుల్లో అగ్రనేతలు లేరు...

ఎన్‌కౌంటర్‌లో మరణించినవారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు మొదట ప్రచారమైంది. అయితే, వారిలో అగ్రనేతలు ఎవరూ లేరని సమాచారం. ఈ ఎన్‌కాంటర్‌లో తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి జగన్ కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన పేర శనివారం ఓ పత్రికా ప్రకటన వెలువడింది. కంకణాల రాజిరెడ్డి కూడా మృతుల్లో లేడు. మరో కీలక నేత దామోదర్ కూడా లేడు.

 మృతులు పది మంది వీరే...

మృతులు పది మంది వీరే...

మృతి చెందిన మావోయిస్టులు వీరే - దండబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ (డిసిఎం, సిఆర్‌బి ప్రెస్), ఐతు (తిప్పాపురం, దళం మెంబర్), బుద్రి (సింగం, సిజి, దళం మెంబర్), రేణి (వీరాపురం, సుక్మా, సిఆర్‌సి డాక్టర్స్ టీమ్, ఎసిఎం), మల్లేష్ (ఇంద్రావతి, సిజి, సిఆర్‌సి, ఎ - సెక్షన్ కమాండర్), కమల (వెస్ట్ బస్తర్, దళం మెంబర్), కోసి (రంగాయిగూడెం, సిఆర్‌సి దళం మెంబర్), సుక్కి (గాంగ్లూర్, ధళం మెంబర్), రత్న (బిజాపూర్, ధలం సభ్యురాలు), సోంబి (దళం సభ్యురాలు). అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

మృతుల్లో మహిళా డాక్టర్

మృతుల్లో మహిళా డాక్టర్

మృతి చెందిన మహిళా మావోయిస్టుల్లో రేణి వైద్యురాలని తెలుస్తోంది. వైద్య విద్య చదివిన ఆమె కొద్ది రోజుల క్రితమే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తోంది. మరణించిన మహిళా నక్సలైట్లలో రత్న వరంగల్ జిల్లా హన్మకొండ మండలం రాంపూర్‌కు చెందినట్లు చెబుతున్నారు.

ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే...

ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే...

ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే బలగాలు చుట్టుముట్టి నక్సలైట్లను హతమార్చినట్లు చెబుతున్నారు. మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి జగన్ కూడా ఓ ప్రకటనలో అదే ఆరోపణ చేశాడు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలయాస్ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వార్తలను జగన్ ఖండించారు.

English summary
It is said top leaders of Maoists have not been killed Cherla encounter in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X