హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవీకే గ్రూప్ కేసులో బరిలో దిగిన ఈడీ: స్పీడందుకున్న దర్యాప్తు: హైదరాబాద్ సహా: సోదాల్లో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణరంగంలో ఒక వెలుగు వెలిగిన జీవీకే గ్రూప్ సంస్థ ప్రతిష్ఠ మసకబారింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో 700 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది జీవీకే గ్రూప్. ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ కేసులను నమోదు చేసింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. జీవీకే గ్రూప్ సంస్థలకు చెందిన పలు కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.

టార్గెట్.. 2024: సోము నియమాకంపై బీజేపీలో జోష్: ఆర్ఎస్ఎస్ ముద్ర: డైహార్డ్ నేతగా: కన్నా సహాటార్గెట్.. 2024: సోము నియమాకంపై బీజేపీలో జోష్: ఆర్ఎస్ఎస్ ముద్ర: డైహార్డ్ నేతగా: కన్నా సహా

హైదరాబాద్, ముంబైల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రోజంతా ఈ సోదాలు కొనసాగుతాయని చెబుతున్నారు. జీవీకే గ్రూప్ ఛైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట సంజయ్ రెడ్డిపై ఇదివరకే సీబీఐ కేసులు నమోదు చేసింది. 705 కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్ కేసులో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఈఎల్)పై కేసులు నమోదు చేశారు.

Enforcement Directorate conducts searches in Hyderabad and Mumbai

ముంబై అంతర్జాతీయ విమానాశ్రాయన్ని అభివృద్ధి చేసే సమయంలో ఈ రెండు సంస్థలతో పాటు మరో 11 అనుబంధ కంపెనీలు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ. దీనిపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొన్ని విదేశీ సంస్థలు జాయింట్ వెంచర్ కింద ఎంఐఈఎల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ సంస్థ వాటా 50.05 శాతం ఉంది. బోగస్ బిల్లులను సమర్పించడం ద్వారా 705 కోట్లను దారి మళ్లించారని అంటున్నారు.

Recommended Video

Nithiin Shalini Wedding | వైభవం గా నితిన్, షాలిని ల వివాహ వేడుక | Oneindia Telugu

కేసు దర్యాప్తు వేగాన్ని పెంచారు. హైదరాబాద్, ముంబైలల్లో జీవీకే గ్రూప్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు మంగళవారం ఉదయం ఆరంభం అయ్యాయి. ఏకకాలంలో ఈ దాడులను చేపట్టారు. దీనికోసం ఈడీ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడటం ద్వారా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించారని అంటున్నారు. కొన్ని ఇన్‌ఫ్రా సంస్థలతో బోగస్ కాంట్రాక్టులను కుదుర్చుకున్నారని, వాటి పేరుతో నిధులను దారి మళ్లించినట్లు చెబుతున్నారు. సోదాల సందర్భంగా ఈడీ అధికారులు వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
A money laundering case booked against the GVK Group, the Enforcement Directorate (ED) is on Tuesday conducting searches in Hyderabad, Mumbai and other places connected to the GVK group’s chairman G Venkata Krishna Reddy and his son G Venkata Sanjay Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X