ఆ ముగ్గురికి రాష్ట్రాన్ని పంచారు: ఎర్రబెల్లి, పండగల ప్రభుత్వాలన్న గుత్తా

వరంగల్/నల్గొండ: తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. బుధవారం తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు.

రైతు రుణాలు మాఫీ అయ్యే వరకు తమ పోరాటం సాగిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని కొడుకు, కూతురు, అల్లుడికి పంచిపెట్టారని ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని కె చంద్రశేఖర్ రావు అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

Errabelli and Ramana fires at CM KCR

అధికారులను, ప్రజలను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దౌర్జన్యాలపై ఉద్యోగ నేతల స్పందించాలని అన్నారు. వాటర్‌గ్రిడ్ వేల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

పండగల ప్రభుత్వాలు: గుత్తా ఫైర్

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఓ సీఎం బతుకమ్మల చుట్టూ.. మరో సీఎం అమరావతి చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

Errabelli and Ramana fires at CM KCR

ఇవి ప్రజల ప్రభుత్వాలు కాదని, పండుగల ప్రభుత్వమని, కోట్లాది రూపాయలను ఉత్సవాల పేరిట దుబారా చేస్తున్నారని ఆయన విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో కరువుతో రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.

పత్తికి మద్దతు ధర కల్పించి సిసిఐ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నల్గొండ జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని, నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తే పంటలను కాపాడుకోవచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+