చికెన్, మందుషాపులకు లాభం: ప్లీనరీపై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ ద్వారా చికెన్, మందు షాపుల వాళ్లు బాగుపడ్డారని తెలంగాణ తెలుగుదేసం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. దమ్ముంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. ఖరీఫ్, రబీలో రైతులకు ఎంత కరెంట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్లీనరీలో పెత్తందారీతనం కనిపించిందని మరో తెలుగుదేశం నేత ఎల్.రమణ ఆరోపించారు. ఫిరాయింపులతో చేసిన తీర్మానాలకు విలువలేదన్నారు.
రాజీనామాలు చేయకుండా తమ పార్టీ ఆఫీస్‌ల ఎదుట ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఫిరాయింపుదారులు అనుభవిస్తున్న పదవులు టీడీపీ కార్యకర్తల రెక్కల కష్టమని ఎల్.రమణ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications