వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపిలో ఈటల చిచ్చు.!పెరుగుతున్న అసమ్మతి.!గులాబీ వైపు చూస్తున్న కమలం నేతలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం బారతీయ జనతా పార్టీ మీద తీవ్ర ప్రబావం చూపుతోంది. ఈటల ఏ క్షణాన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసారోగానీ బీజేపిలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. భవిష్యత్ రాజకీయాల మీద గంపెడు ఆశలు పెట్టుకుని పార్టీలో నెట్టుకొస్తున్న నేతల పాలిట ఈటల రాజేందర్ శరాఘాతంలా పరిణమించినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది.

ప్రధానంగా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను ఈటల రాజేందర్ పూర్తిగా మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ రాకను వ్యతిరేకిస్తూ బిజెపి నుండి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు హుజురాబాద్ మున్సిపల్ 11 వ వార్డు కౌన్సిలర్ దండ శోభ పేర్కొన్నారు. నేడు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై సునీల్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

Etala Rajendar Effect in BJP!Lotus leaders looking towards the Trs.!

ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు తమ స్పందన తెలియజేసారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, గత ఎన్నికల్లో స్వతంత్ర కౌన్సిలర్ గా గెలిచి బీజేపీలో చేరామని, భూ ఆరోపణలు ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణ కు గురై, మళ్ళీ బీజేపీ లో చేరుతున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. అభివృద్ధి సంక్షేమం అధికార టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్ఎస్ లోచేరుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ 11వ డివిజన్ బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ దండ శోభ, మాజీ ఎంపీటీసీ దండ విక్రమ్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు భాస్కర్ రెడ్డి, ప్రతాప ఆంజనేయులు, మధుసూదన్ మరియు ప్రజాప్రతినిధులు పాల్టొన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, దొంత రమేష్, చల్ల హరిశంకర్, బోనాల శ్రీకాంత్, బండారు వేణు తదితరులు పాల్గొన్నారు

English summary
The influence of former minister Etala Rajender is having a profound effect on the BJP. At any moment, Union Minister Kishan Reddy met and the BJP was shaking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X