ఏపీకిచ్చారు.. మాకివ్వండి, మీ అనుమతి ఎందుకు: కేంద్రానికి ఈటెల (పిక్చర్స్)
సూరజ్‌కుండ్: రాష్ట్రం తెచ్చుకునే అప్పులకు కేంద్రం అనుమతి ఎందుకని, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లుగా తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం అన్నారు. కేంద్ర బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను మంజూరు చేయాలనీ, కేంద్ర బడ్జెట్‌లోనూ నిధులను పొందుపర్చాలని కేంద్రాన్ని కోరారు. నిబంధనలని అమలు చేసినందున, రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ పాలక సంస్థలకు గతంలో తిరస్కరించిన రూ.778 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేయాలన్నారు.
వెనుకబడిన ప్రాంతాలకు సాయపడతామంటూ ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని, దీనికి అనుగుణంగా ఏపీకి రూ.700 కోట్లను ఇచ్చారని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీపై నీతి ఆయోగ్ సిఫారసులు కేంద్ర ఆర్థికశాఖకు వెళ్లాయని, తమ రాష్ట్రానికి కూడా వెంటనే నిధులను ఇచ్చి, 2016-17 కేంద్ర బడ్జెట్‌లోనూ కేటాయింపులు చూపించాలన్నారు.

ఈటెల రాజేందర్
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతున్నదేగానీ చేతల్లో ఎలాంటి ఆచరణను చూపడంలేదని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

ఈటెల రాజేందర్
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని, సహకార సమాఖ్య అంటూ రకరకాల వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. వాటిని ఆచరణలో పెట్టడంలో వెనుకంజవేస్తున్నారన్నారు.

ఈటెల రాజేందర్
రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఆర్థికసాయం అందించాల్సిన కేంద్రం ఆ పని చేయకపోగా వివిధ ద్రవ్య సంస్థల నుంచి రుణాన్ని పొందేందుకు కూడా అనుమతివ్వడంలేదన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న సామెత చందంగా కేంద్రం వైఖరి ఉందని దుయ్యబట్టారు.

ఈటెల రాజేందర్
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈటెల రాజేందర్, రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈటెల రాజేందర్
ఇందులో రాష్ర్టానికే పరిమితమైన అంశాలను, దేశానికంతటికీ వర్తించే ఇతర అంశాలను ఈటెల ప్రతిపాదించారు. సమావేశం అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు.

ఈటెల రాజేందర్
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ర్టాలకు 10% పెంపుతో మొత్తం 42% మేరకు పన్ను వాటా చెల్లిస్తున్నామని కేంద్రం చెప్తున్నదని, కానీ అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎత్తివేసి, భారీగా కోతపెట్టి ఆ భారాన్ని రాష్ట్రాలపై నెట్టివేసిందన్నారు.

ఈటెల రాజేందర్
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు కేంద్రంనుంచి ఆర్థిక సాయం అందుతుందన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రాలు వాటిని అమలు చేస్తున్నాయని, కానీ కేంద్రం నిధులు నిలిపివేయడంతో పరిస్థితి తారుమారు అవుతుందన్నారు.

ఈటెల రాజేందర్
మోడల్ స్కూళ్ల పథకం ఇంకా కిందిస్థాయికి చేరకముందే దాన్ని కేంద్రం రద్దు చేసిందని, కస్తూర్బా విద్యాలయాల పథకమూ రద్దయిందన్నారు. ఐసీడీఎస్ నిధుల్లో భారీగా కోత విధించిందని, గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.17,800 కోట్లు కేటాయిస్తే ఈసారి ఆ మొత్తం రూ.8,000 కోట్లు మాత్రమేనన్నారు.

ఏపీకిచ్చారు.. మాకివ్వండి, మీ అనుమతి ఎందుకు: కేంద్రానికి ఈటెల (పిక్చర్స్)
ఏపీకిచ్చారు.. మాకివ్వండి, మీ అనుమతి ఎందుకు: కేంద్రానికి ఈటెల (పిక్చర్స్)












Click it and Unblock the Notifications