లోక్ సభ ఎన్నికల బరిలో ఈటల రాజేందర్.. అక్కడ రేవంత్ ను టెన్షన్ పెట్టే వ్యూహం!!

రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బిజెపి రెడీ అవుతుంది. బిజెపిలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి అభ్యర్థులను ముందే ఎంపిక చేసే పనిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తారని భావించి పోటీ చేసిన పలువురు కీలక నాయకులు ఓటమిపాలు కావడంతో వారిని లోక్సభ ఎన్నికల బరిలోకి దించేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే గజ్వేల్, హుజురాబాద్ లలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఈటల రాజేందర్ కు బిజెపి లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. రానున్న లోక్ సభ ఎన్నికలలో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Etela Rajender to contest in the Lok Sabha elections 2024 to put tension on Revanth in that constituency!!

మల్కాజ్ గిరి టికెట్ ను బిజెపి ఈటల రాజేందర్ కు కేటాయించనున్న క్రమంలో ఈటల రాజేందర్ నేడు షామీర్ పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు, తనకు సహకరించే నాయకులకు దీనికి సంబంధించిన వివరాలను తెలియజేయునట్టు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్న బిజెపి టికెట్ కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.

మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

రేవంత్ రెడ్డి వ్యూహాలను గీటుగా ఎదురుకోవడం కోసం బిజెపి బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దింపబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది బీజేపీ.

సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుండి ఎం రఘునందన్ రావు, భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరి నుంచి అవకాశం కల్పించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+