సారిక మృతి: అన్నంలో మత్తుమందు? మరో మలుపు, 22 పేజీల ఈ-మెయిల్ (పిక్చర్స్)
వరంగల్: అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమైన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఉదయం పదకొండు గంటలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు.
అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరోవైపు, రాజయ్యను, కుటుంబ సభ్యులను మామునూరు పోలీసు స్టేషన్లో ఉంచారు. వారి ముగ్గురిని పోలీసులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు.ముగ్గురిని ఈ రోజు కోర్టు ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. బుధవారం తెల్లవారుజామున హన్మకొండలోని రాజయ్య నివాసంలో సారిక, ఆమె ముగ్గురు కుమారులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.
పోలీసులు దీని హత్యగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. భోజనంలో మత్తుమందు కలిపారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంట్లోని భోజన పదార్థాలను సీజ్ చేశారు. భోజనంలో మత్తు పదార్థాలు పెట్టి, వారుమత్తులోకి వెళ్లాక, హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
సారిక కేసు మరో కీలక మలుపు తిరిగింది. చనిపోవడానికి ముందు సారిక ఈ మెయిల్ నోట్ రాసింది. ఆమె ఈ మెయిల్‌ను పోలీసులు హ్యాక్ చేశారు. దాంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 22పేజీల ఈమెయిల్ ఆమె రాసినట్లుగా తెలుస్తోంది.

సారికను పెళ్లాడిన అనిల్
రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి నేపథ్యంలో రాజయ్యను, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి
కోడలుతో కొన్ని రోజులుగా వివాదం ఉన్న నేపథ్యంలో రాజయ్య కుటుంబం ఆమెకు దూరంగా ఉంటోంది. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించిన నేపథ్యంలో సెంటిమెంటుగా భావించి... కెఎల్ఎన్ రెడ్డి నగర్లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్న రాజయ్య ఇటీవలే రెవెన్యూ కాలనీలోని పాత ఇంటికి వచ్చారని సమాచారం.

రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి
మంగళవారం రాత్రి కోడలుకు, రాజయ్యకు మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. మరోవైపు, తనకు టిక్కెట్ ఇవ్వవద్దని కోడలు సారిక.. ఏఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసి, అది అడిగేందుకు వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి.

రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి
ఆ ఇంటిలో రాజయ్య మొదటి అంతస్తులో ఉంటున్నారు. బుధవారం వేకువజామున నాలుగు గంటల తర్వాత కోడలు ఉంటున్న రెండో అంతస్తులో బెడ్ రూం నుంచి పొగలు వచ్చాయ. దీంతో రాజయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి
సారిక బెడ్ రూం తలుపులకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో రంద్రం చేశారు. గదిలో అప్పటికే మంటలు చెలరేగుతున్నాయి. మంటలను ఆర్పిన తర్వాత పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు. లోపల హృదయ విదారక దృశ్యం కనిపించింది.

రాజయ్య కోడలి మృతిపై మీడియాతో పోలీసులు
సారిక, మనవల సజీవ దహనం నేపథ్యంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసుల వైపు నుంచి ఈ ఘటనకు సంబంధించి స్పష్టత రాకపోవడం.. రాజయ్య కుమారుడికి, కోడలికి మధ్య వివాదాలతో వారు వేర్వేరుగా ఉంటుండడం.. రాజయ్య కుటుంబం ఈ మధ్యే ఈ ఇంటికి వచ్చి ఉండడం సందేహాలకు కారణాలవుతున్నాయి.

మహిళా సంఘాల ధర్నా
మరికొన్ని అంశాల పైన చర్చ సాగుతోంది. రాజయ్యకు ఈసారి వరంగల్ లోకసభ స్థానానికి టికెట్ ఇవ్వవద్దని సారిక ఈ మధ్యే ఏఐసీసీకి లేఖ రాసినట్లు పార్టీవర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. దీన్నిబట్టి సారికకు రాజయ్య కుటుంబంతో ఇప్పటికీ స్పర్థలు, వివాదాలు తారస్థాయిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

మృతి చెదిన రాజయ్య మనవళ్లు
ఈ పరిస్థితుల్లో హన్మకొండలోని మరో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రాజయ్య కుటుంబం ఇటీవలే సారిక ఉంటున్న ఇంటికి రావడం పట్ల కూడా స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సారిక గది నుంచి పొగలు రావడం రాజయ్య కుటుంబీకులు గమనించారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో ఎలాంటి కేకలు వినిపించలేదని వారు చెప్పారంటున్నారు.

మృతి చెదిన రాజయ్య మనవళ్లు
అంతగా శరీరాలు కాలినా కూడా కేకలు పెట్టకపోవడంతో ఎవరైనా మత్తుమందు ప్రయోగించారా అనే చర్చ నడిచింది. గ్యాస్ లీకైతే మంటలు గదిలో ఒక్కసారిగా వ్యాపిస్తాయని, అలా జరిగితే మొత్తం శరీరాలు కాలిపోయి ఉండాలని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు. కానీ చనిపోయిన వారి కాళ్లు మాత్రం కాలలేదంటున్నారు.

రాజయ్య నివాసం వద్ద జనం
గ్యాస్ లీకవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటే దాని తీవ్రత భవనం మొత్తమ్మీద ఉండేదని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఆ గది కూడా పెద్దగా దెబ్బతినలేదు. ఇవన్నీ ప్రాథమికంగా గ్యాస్ లీకని భావిస్తున్నామనే పోలీసుల అభిప్రాయాన్ని వ్యతిరేకించేలా ఉన్నాయి. అదే సమయంలో గ్యాస్ బండలో గ్యాస్ లేదని కూడా చెబుతున్నారు.

రాజయ్య కోడలు సారిక తల్లి వస్తున్న దృశ్యం
సారిక ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసింది. పెళ్లయి పిల్లలు పుట్టాక ఉద్యోగం మానేసింది. ఆమె బాగా చదువుకుందని, ఎంత కష్టమైనా న్యాయ పోరాటం చేస్తుంది తప్పితే ఇంత పిరికిగా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని స్థానికులు చెబుతుండడం గమనార్హం.

సారిక
సారిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2002లో యాదగిరిగుట్టలో అనిల్, సారికల ప్రేమ వివాహం జరిగింది. 2006లో పెళ్లి జరిగినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అనంతరం సారిక పుణెలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఇద్దరూ కలిసి 2009 దాకా హైదరాబాద్‌లో నివాసమున్నారు. ఈ సమయంలో పెద్దలు కూడా కలిశారు. ఆ తర్వాత నుంచి సారిక, అనిల్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2009లో భర్తతోపాటు మామ రాజయ్యపై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో సారిక ఫిర్యాదు చేసింది. బిడ్డను పట్టించుకోవట్లేదని, వివాదాలు ఎక్కువవుతున్నాయని చెప్పింది. దీనిపై కేసు నమోదు కాకపోయినా ఇరుపక్షాల మధ్య పంచాయతీలు నడిచాయి.

రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి
అనిల్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలడంతో వివాదం మరింత ముదిరింది. అప్పట్లో సారిక నిద్రమాత్రలు మింగింది. వేరొక మహిళతో సన్నిహితంగా ఉండడంతో సారికకు, ఆమె కుమారుడికి అన్యాయం జరుగుతుందని ఇరు కుటుంబాల్లో చర్చ జరిగింది. అనిల్‌కు వరంగల్‌తోపాటు హైదరాబాద్‌లో ఇల్లుంది. 2013లో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మళ్లీ వివాదం తీవ్రమైంది. అప్పట్లో సారిక తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని, తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిల్, రాజయ్య కుటుంబంతోపాటు ఓ మహిళపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది.

రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి
2014 సాధారణ ఎన్నికల తర్వాత హన్మకొండలోని స్వగృహంలో సారిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పట్లో పోలీసులు అనిల్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారని చెబుతున్నారు. తరచూ ఇరువర్గాల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి కూడా వివాదం జరిగిందని బంధువులు చెబుతున్నారు. వరకట్న వేధింపులతోపాటు తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడంటూ గతేడాది కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు బేగంపేట పోలీసులు నిరుడు ఫిబ్రవరిలో రాజయ్య (అప్పుడు వరంగల్ ఎంపీ), ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌తోపాటు మరో మహిళలపై ఐపీసీ 498ఏ, 494, 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. అనిల్‌ను పిలిచి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. ఛార్జిషీట్ దాఖలు చేసే సమయంలో రాజయ్య ప్రమేయం లేదని ఆధారాలు లభించడంతో ఆయన పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోందని, తదుపరి విచారణ గురువారం (నవంబరు 5, 2015) జరగాల్సి ఉంది.

మీడియాతో మాట్లాడుతున్న పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్‌కుమార్, సారిక చదువుకునేటప్పుడే ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరిలో మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. 2003లో అనిల్, ఆ తర్వాత సారిక లండన్ వెళ్లారు.

మీడియాతో కుటుంబ సభ్యులు, పోలీసులు
రెండేళ్ల అనంతరం హైదరాబాద్‌కు తిరిగొచ్చి పెళ్లి విషయాన్ని రాజయ్యకు చెప్పగా యాదగిరిగుట్టలో వివాహం జరిపించారు. అంతా కలిసి వివాహం చేసినా తనను ఇంట్లోకి రానిచ్చేవారు కాదని, పైపోర్షన్‌లోనే ఉంచారని సారిక న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది.

రాజయ్య నివాసం వద్ద
చివరకు ఇంటి ఖర్చులకు కూడా డబ్బులిచ్చేవారు కాదని పేర్కొంది. దీంతో పాటు అనిల్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, పెళ్లి కూడా చేసుకున్నాడని సారికకు తెలిసింది. దీనిపై వరంగల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజయ్య రాజకీయంగా ఒత్తిడి తెస్తారని భావించి నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేయాలని బేగంపేట పోలీసులను కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications