ఆ హాస్పిటల్ పై సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు అల్టిమేటం!
మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన హెల్త్ సిటీ అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతోందని, ప్రజల ఆరోగ్య రక్షణ కల్పించే ఆస్పత్రి పనులు అతీగతీ లేదు కానీ, ఫ్యూచర్ సిటీ కడతారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను మాజీ మంత్రి నేడు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆస్పత్రి ప్రారంభం అయ్యేది: హరీష్ రావు
హాస్పిటల్ నిర్మాణంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నిస్తూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికి ఆస్పత్రిని ప్రారంభించేవాళ్లమని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన హెల్త్ సిటీ అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. 24 అంతస్తుల భవనాన్ని కేసీఆర్ నిర్మించారని, ఫినిషింగ్ వర్క్ కూడా రేవంత్ సర్కార్ ఇప్పటివరకు చెయ్యలేకపోయిందని అన్నారు.

పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి.. లేదంటే ధర్నా చేస్తాం
అవసరమైన నిధులు గత ప్రభుత్వమే సమకూర్చిందని తెలిపారు. జూన్ 2న హాస్పిటల్ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. కేవలం ఓపీ సేవలతో ప్రారంభించడం సరిపోదని అన్నారు. ఇది బస్తీ దవాఖాన కాదని, కనీస అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. హాస్పిటల్‌ను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ఇక్కడే ధర్నాకు దిగుతామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.
ఎంజీఎం ఆస్పత్రిలో అన్నీ సమస్యలే
ఎంజీఎం హాస్పిటల్‌ను రాష్ట్ర మంత్రులు సందర్శించలేదని, గుండె శస్త్రచికిత్సల సౌకర్యం లేక సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ యంత్రాలు పనిచేయకపోవడం, మందుల కొరత, వైద్యుల కొరత వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన అన్నారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని, ఉద్యోగులకు పీఆర్‌సీ, బకాయిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేవాదుల మోటార్లన్నీ విడుదల చేయించిన ఘనత బీఆర్ఎస్ దే
దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి మోటార్లన్నీ విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారని, అయితే అది బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం ఫలితమేనని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఎకరా భూ సేకరణ కూడా జరగలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని డెడ్‌లైన్‌లు మారుతున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు.గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించిన ఆయన, బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరిని నిండు కుండలా మార్చిందని వ్యాఖ్యానించారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications