చెక్ బౌన్స్ కేసు: జగన్ పార్టీ నేత రెహమాన్‌కు ఏడాది జైలు
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో మాజీ ఎమ్మెల్సీ, వైయస్సార్ కాంగ్రెస్ నేత రెహమాన్‌కు రంగారెడ్డి జిల్లా ఐదో అదనపు న్యాయస్థానం శిక్ష విధించింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.44 లక్షలభారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మంగళవారం తీర్పు ఇచ్చారు. 2009లో శ్రీనివాస్‌గౌడ్ అనే వ్యక్తి రెహమాన్‌పై ఫిర్యాదు చేశారు.

చికిత్స పొందుతూ మహిళా ఖైదీ మృతి
గుండె నొప్పితో ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. చంచల్‌గూడ మహిళ జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన వడ్డెర రేణుక(39) ఓ హత్య కేసులో నిందితురాలు.
ఆమెను పోలీసులు గత డిసెంబర్‌లో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. మంగళవారం ఉదయం రేణుకకు అకస్మాత్తుగా గుండె నొప్పి రాగా, జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉస్మానియా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మృతురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సిఐ కెపివి రాజు తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications