రూ 105కే ఆ బ్రాండ్ మద్యం, ఎక్సైజ్ కొత్త ప్రతిపాదన - ధరల పెంపు వేళ..!!
మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. గత ఆర్దిక సంవ త్సరంలో రికార్డు స్థాయిలో లిక్కర్ ఆదాయం వచ్చింది. అంతకంటే ఎక్కువగా ప్రస్తుత ఆర్దిక సంవ త్సరంలో ఆదాయం దక్కించుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది. మందుబాబులను ఆకట్టుకునేలా.. ధరలను తగ్గించే ఫార్ములా సిద్దం చేసింది. అందులో భాగంగా బ్రాండెడ్ మద్యం మార్కెట్ లోకి తీసుకొస్తూనే.. కొత్త తరహా అమ్మకాలకు కసరత్తు చేస్తోంది. తాజా ప్రతిపాదనల మేరకు క్వార్టర్ మద్యం ధర పైన చేసిన ప్రతిపాదనకు ఆమోదం దక్కాల్సి ఉంది.
కొత్త మార్గాల్లో అమ్మకాలు
మందుబాబులకు మందు మరింత సులభంగా అందనుంది. తక్కువ ధరలకే మద్యం అందు బాటు లోకి తెచ్చేలా రంగం సిద్దమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఖజనాను నింపుతున్నాయి. ఇదే సమయంలో మరింత కొత్త ఆలోచన లతో అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్లకు అదనంగా కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తోంది. దీంతో, పాటుగా అమ్మకాల్లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం ఇకఅందుబాటులోకి రానుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు.

ఉత్పత్తి వ్యయం తగ్గేలా
సీసాలో దొరుకుతున్న మద్యం కంటే.. టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు లభించనుంది. రాష్ట్రంలో ఇప్పుడు క్వార్టర్ చీఫ్ లిక్కర్ ధర రూ.120గా ఉంది. అదే మద్యం టెట్రా ప్యాకెట్లలోకి మారితే రూ.100లకు లభించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి. టెట్రా ప్యాకెట్లలో రాష్ట్రంలో 2620 వైన్ షాపులు, 1117 వరకు బార్లున్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెక్‌డొవెల్స్ నంబర్ వన్ అనే కంపెనీ 90శాతం టెట్రా ప్యాకెట్లలో విక్రయాలు జరుపుతోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో విక్రయించడానికి ముందుకొచ్చింది.
రూ 105 కే క్వార్టర్
ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్ బాటిల్స్ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ... దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడు, కంపెనీకు కలిగే ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. రూ 105 కే క్వార్టర్ మద్యం కర్ణాటకలో 90 ఎంఎల్, 180 ఎంఎల్ ప్యాకెట్లు విక్రయిస్తుండగా, తెలంగాణలో వీటితోపాటు 60 ఎంఎల్ ప్యాకెట్లు కూడా తేవాలని ప్రతిపాదించారు. సీసా మద్యంతో పోల్చినప్పుడు టెట్రా ప్యాకెట్ మద్యం మందుబాబులకు రూ.10 నుంచి రూ.15 తకువ ధరకే లభిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం క్వార్టర్ చీప్ లికర్ ధర రూ.120 ఉన్నది. ఇదే మద్యం టెట్రా ప్యాక్‌లోకి మారితే రూ.105కే లభిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన మందుబాబులకు ఒక క్వార్టర్ మద్యం మీద రూ.15 మేర మిగులుతుందని వివరిస్తున్నారు. ఈ టెట్రా ప్యాకెట్ అమ్మకాల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications