Exclusive: ఏసుక్రీస్తు నిర్మింపజేసిన ఆసియాలోనే అతిపెద్ద, అద్భుతమైన చర్చి మన తెలంగాణాలో!

ఆసియా ఖండంలోనే అరుదైన విశేషాలతో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చర్సిగా గుర్తింపు పొందిన చర్చి క్రీస్తు జ్యోతి చర్చి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం యొక్క విశేషాలను తెలుసుకుందాం వన్ ఇండియా తెలుగు ఎక్స్‌క్లూజివ్ కథనంలో

ఆసియా ఖండంలోనే అద్భుత నిర్మాణం
వరంగల్ శివారులో కరుణాపురంలో మొత్తం 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 9 ఎకరాల స్థలంలో క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం నిర్మితమైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా అత్యంత విశేషాలు ఉన్న చర్చిగా దీనికి పేరు ఉంది. 2016 జూన్ 11వ తేదీన రేకులతో నిర్మించాలని భావించి మొదలుపెట్టిన ఈ చర్చి ఎవరు ఊహించని విధంగా అద్భుత నిర్మాణంగా మారింది. చర్చి నిర్మాణానికి 150 కోట్ల రూపాయలను నిర్వాహకులు ఖర్చు చేశారు.

Exclusive Asia largest and most famous church christhu jyothi church karunapuram built by Jesus Christ himself

150 కోట్లతో అద్భుత నిర్మాణం.. యూఎస్ నుండి డూమ్

మొత్తం లక్ష 50 వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంతో 240అడుగుల వెడల్పు 240అడుగుల ఎత్తుతో ఈ చర్చిని నిర్మించారు. ఒకేసారి ఇందులో 30వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా నిర్మాణం చేశారు. ఈ చర్చి నిర్మాణానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్ తెప్పించారు. చర్చి లోపల పై భాగంలో అమర్చిన అల్యూమినియం గోపురం స్టార్ ఆకారంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ డోమ్ అమెరికా నుండి తెప్పించారు.

ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం
ఇక ఈ చర్చిలో ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం ను ఏర్పాటు చేశారు. మందిరం లోపల అంతట రీ సౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ ను వినియోగించారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ పంక తరహాలో భారీ ఫ్యాన్ లను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ ప్రార్థన మందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. పిల్లర్స్ నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీని వినియోగించారు.

వజ్రాలు,ముత్యాల వినియోగం.. దీప స్తంభాలు ప్రత్యేకం
చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని బైబిల్ లోని అనేక ఘట్టాలను తెలియజేసేలా అద్దాల చిత్రాలను రూపొందించారు. ఇక ఈ ప్రార్థన మందిరంలో చుట్టూ ఏర్పాటు చేసిన దీప స్థంబాలు వేటికవే ప్రత్యేకం. దీని నిర్మాణంలో జెరూ సలేం నుంచి తెచ్చిన మట్టిని వినియోగించారు. భవన నిర్మాణానికి ముందు శంకుస్థాపనలో వజ్రాలను వేశారు. లోపల ముత్యాలతో పొదిగిన బైబిల్ లోని రూపాలు ఉన్నాయి.

16 వందల ఏళ్ళనాటి ఆలివ్ చెట్లు
ఈ ప్రార్థన మందిరం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడంలో ఫాదర్ పాల్సన్ రాజ్ కీలక భూమిక పోషించారు. ఫాదర్ పాల్సన్ రాజ్ సాక్షాత్తు ఏసుక్రీస్తు తాము ఎవరు ఊహించని విధంగా ఈ చర్చి నిర్మాణానికి దోహదం చేశారని ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా చర్చి నిర్మాణం వెనుక ఈ అద్భుతమైన కళా సంపద సృష్టి వెనుక ఏసుక్రీస్తు ఉన్నాడని చెబుతున్నారు. 1600సంవత్సరాల నాటి ఇజ్రాయిల్ దేశంలోని ఆలివ్ చెట్లను ఇక్కడ పెంచుతున్నారు.

Exclusive Asia largest and most famous church christhu jyothi church karunapuram built by Jesus Christ himself

ఏడేళ్ళ పాటు నిర్మాణం
దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ ప్రార్ధనా మందిరానికి వచ్చే క్రీస్తు విశ్వాసకుల సహకారంతో ఇది నిర్మాణం జరిగింది. ప్రతిరోజు దాదాపు 200 మంది క్రీస్తుపై విశ్వాసంతో ఈ మందిరాన్ని నిర్మించడానికి పనిచేశారు.ఇన్ని విశేషాలు ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. క్రైస్తవుల కోసం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశ విదేశాల నుండి ప్రముఖులు వస్తున్నారు.

ఆకట్టుకుంటున్న క్రీస్తు జ్యోతి ప్రార్ధనా మందిరం
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏసుక్రీస్తు జన్మను తెలియజేసేలా పశువుల పాకలో ఏర్పాటు చేసిన బాల యేసు పుట్టుక ఘట్టం ప్రస్తుతం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇందులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఈజిప్ట్ నుంచి తెప్పించారు. యూఎస్, ఫ్రాన్స్, జపాన్, చైనా, హాలండ్, ఇజ్రాయిల్, వియత్నాం, ఇలా అనేక ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన నిర్మాణ సామాగ్రి తో, విదేశీ టెక్నాలజీతో ఈ ప్రార్ధనా మందిరం సర్వాంగ సుందరంగా ఆకట్టుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+