మహిళ పట్ల అసభ్యంగా: దొంగబాబాను చెట్టు కట్టేసి చితగ్గొట్టారు

హైదరాబాద్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ దొంగ బాబాను తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ప్రజలు చితగ్గొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బంటారం మండలం తోరుమామిడి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

ఆరు నెలల క్రితం రహీంబాబా అనే ఈ నకిలీ బాబా కర్ణాటక నుంచి తోరుమామిడి గ్రామానికి వచ్చినట్లు సమాచారం. వ్యవసాయ పొలంలో చిన్న కుటీరం వేసుకుని జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళ జాతకం చెప్పించుకోవడానికి బాబా వద్దకు వెళ్లింది.

Fake bbaba arrested in Rangareddy district

తన భర్త మూడేళ్ల నుంచి కనిపించడం లేదని ఎక్కడున్నాడో తెలపాలని బాబాను కోరింది. అయితే, రాత్రి రావాలని చెప్పి పంపించాడు. ఆ మహిళ ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి బాబా వద్దకు వెళ్లింది. తల్లిని బయట ఉంచి కూతురిని లోపలికి రమ్మన్నాడు.

లోపలికి వచ్చిన మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె గ్రామ ప్రజలకు తెలిపింది. దీంతో గ్రామస్థులు దొంగ స్వామిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+