హైదరాబాద్‌లో నకిలీ డ్రగ్స్ దందా: గర్భిణీలు, చిన్నపిల్లల మందులే, రూ.500కోట్లు!
గర్భిణీలు, చిన్నపిల్లలు ఉపయోగించే మందులను వీరు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: రాజధానిలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు.. నకిలీ డ్రగ్స్ తయారీపై కేంద్రంపై దాడులు చేశారు.
గర్భిణీలు, చిన్నపిల్లలు ఉపయోగించే మందులను వీరు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గర్భిణీలు ఉపయోగించే ప్రోటీన్ పౌడర్, టానిక్స్, చిన్నపిల్లలు తాగే మిల్క్ పౌడర్ లకు వీరు నకిలీలు తయారుచేస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.500కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తుండటం గమనార్హం.

నకిలీ మందుల తయారీ కేంద్రానికి రాజేందర్ రెడ్డి యజమానిగా ఉన్నాడని, ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications