ఫార్మసీ కాలేజీ కార్యదర్శిని బెదిరించిన జగన్ అరెస్టు
హైదరాబాద్: పీఎన్‌ఆర్ ఫార్మసీ కాలేజీ కార్యదర్శిని బెదిరించిన నకిలీ నక్సలైట్ రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం కడారా తండాకు చెందిన రత్లావత్ శేఖర్‌నాయక్ హైదరాబాదులోని కర్మాన్‌ఘట్ గ్రీన్‌పార్క్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సీపీఎం గిరిజన సంఘం విభాగం కార్యదర్శిగా చలామణీ అవుతున్న ఇతడు ఓ కార్యక్రమం సందర్భంగా పీఎన్‌ఆర్ ఫార్మసీ కాలేజీ నరేందర్‌రెడ్డిని కలిసి ఫోన్ నెంబరును తీసుకున్నాడు.
ఆ తరువాత నరేందర్‌రెడ్డి బెదిరించి నగదును వసూలు చేద్దామని స్కెచ్ వేశాడు. జనశక్తి గ్రూపు మావోయిస్టు జగన్ పేరుతో శేఖర్‌నాయక్ నరేందర్‌రెడ్డికి ఫోన్ చేసి 15 లక్షల రుపాయాలను డిమాండ్ చేశాడు. జనశక్తి గ్రూపు తెలంగాణలో మొత్తం 100మంది టాప్ బిజినెస్‌మెన్‌లను గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఫోన్‌లో హెచ్చరించాడు.
డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే జనశక్తి అగ్ర నాయకత్వమే చూసుకుంటుందన్నారు. శేఖర్‌నాయక్ ఈ ఫోన్‌లన్ని సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్ కాయిన్ బాక్స్‌ల ద్వారా చేస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. నరేందర్‌రెడ్డి ఫిర్యాదుతో ఎస్‌ఓటీ పోలీసులు కాయిన్ బాక్సుల వద్ద మాటు వేసి మరోసారి బెదిరింపులకు పాల్పడుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం శేఖర్‌నాయక్‌ను మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications