కోతులకు కుటుంబ నియంత్రణ.!కోతుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయోగం.!
హైదరాబాద్ : చేతికొచ్చిన పంటలను, పండ్ల తోటలను కోతులు నాశనం చేస్తున్నాయని, కోతుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. కోతుల బెడద నివారణపై అరణ్య భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీరితో పాటు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి పాల్గొన్నారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని, గతంలో సీఎం చంద్రశేఖర్ రావు ఇదే అంశంపై దిశానిర్దేశం చేసారని మంత్రులు గుర్తు చేసారు.

కోతుల బెడదను నివారించాలి.. పంటను కాపాడుకోవాలన్న మంత్రులు
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడదను నివారించి చేతికొచ్చిన పంటను కాపాడాలని మంత్రులు ప్రతిపాదించారు.కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం చేసామని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు ఉన్నాయని కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయబోతున్నట్టు స్పష్టం చేసారు.

కోతులకు ఫామిలీ ప్లానింగ్.. కార్యాచరణ రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రులు తెలిపారు. పంటలకు కోతుల బెడద తీవ్రంగా ఉందని, రైతులను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు మంత్రులు తెలిపారు. చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసారు.

కోతుల నివారణపై అరణ్య భవన్ లో సమీక్ష.. పాల్గొన్న వ్యవసాయ, అటవీ శాఖల మంత్రులు
కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రులు భావించారు. పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలలో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలనిస్తున్నాయని, రైతులకు కోతుల బెడదను తప్పించాలన్న విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు మంత్రులు.
Recommended Video

సీఎం ఆదేశాల మేరకు 8మందితో కమిటీ.. త్వరలో మరో సమావేశమన్న మంత్రులు
కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రులు భేటీ కానున్నారని తెలిపారు. కోతుల బెడద నివారణపై అరణ్య భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు, కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్ రావు గారు, పీసీసీఎఫ్ (సోషల్ ఫారేస్ట్రీ) ఆర్.యం. దొబ్రియల్, సీఎఫ్ హైదరాబాద్ ఎం,జే అక్బర్, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications