ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: ఎట్టకేలకు వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2 నిందితుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ)ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని దమ్మపేట మండలం మందలపల్లి, ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య రాఘవను అరెస్ట్ చేశారు.

విచారణ కోసం రాఘవను కస్టడీలోకి తీసుకున్నారు. రాఘవ వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగ రామకృష్ణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన సెల్ఫీ వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రాఘవపై నాగ రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పలు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ చేయాలని డిమాండ్ చేశారు.

 family suicide case: vanama raghava arrested in telangana-andhra border

కాగా, కొత్తగూడెం వ్యాపారి ఎం నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఇన్ని రోజులు అవుతున్నా వనమా రాఘవను అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీల నుండి ఆరోపణలు వెల్లువగా మారాయి. వనమా రాఘవను టిఆర్ఎస్ పార్టీ నే కాపాడుతుంది అంటూ, ఇప్పటివరకు అరెస్ట్ చెయ్యకుండా ఎక్కడ దాచిపెట్టారు అంటూ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ స్పందించింది. వనమా రాఘవ పై చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత టిఆర్ఎస్ పార్టీ వనమా రాఘవను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు గా అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది.

కేసు విషయానికి వస్తే కొత్తగూడానికి చెందిన వ్యాపారి నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ చేసి కుటుంబసభ్యులతో పాటు నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నాడు. తన కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరిస్తానని ఈ వ్యవహారంలో తలదూర్చిన రాఘవేంద్ర రావు తనకు సహాయం చేయడానికి బదులుగా తన భార్య నుంచి లైంగిక ప్రయోజనాలను కోరినట్టు సూసైడ్ నోట్ లో, అలాగే సెల్ఫీ వీడియో లో నాగ రామకృష్ణ ఆరోపించారు.

English summary
family suicide case: vanama raghava arrested in telangana-andhra border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X