సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ అత్మహత్య..
ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రంతికి గురి చేసింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. అతని మరణానికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో రాజేష్ కు మంచి కొరియోగ్రాఫర్ గా పేరు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్ మాస్టర్‌కు మంచి పేరు ఉంది.
రాజేష్ మాస్టర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ మాస్టర్ మరణవార్త తనను షాక్‌కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇటు టాలీవుడ్ లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్, ప్రత్యూష్, రంగనాథ్ బలన్మరణానికి పాల్పడ్డారు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న తెలంగాణలోని హైదరాబాదులో పుట్టాడు.

తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్ మంచి విజయాలు సాధించాడు. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం, జోడీ నెం1, నీరు నేను నాకు నువ్వు, లవ్ టుడే, ఔనన్న కాదన్నా, పోయి, వియ్యలవారి కయ్యాలు, గుండె ఝల్లుమంది, ఏకలవ్యుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జై శ్రీరామ్ సినిమాల్లో హీరోగా చేశారు.
ఉదయ్ కిరణ్ 2014 జనవరి 6న ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు నటి ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె రాయుడు, శ్రీరాములయ్య, కలుసుకోవాలని చిత్రాల్లో నటించారు. ఆమె 2002 ఫిబ్రవరి 23న ఆత్మహత్య చేసుకున్నారు. 2015లో సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు.












Click it and Unblock the Notifications