Hyderabad: సిటిలో ఫెనటిక్స్ డిజిటల్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్ నగరంలో మరో ప్రముఖ గ్లోబల్ డిజటిటల్ స్పోర్స్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో కొత్త డిజిటల్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఫెనటిక్స్ (Fanatics) తెలిపింది. దీనికి అభిషేక్ ధస్మానాను వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ మేనేజర్‌గా నియమించింది. 2026 నాటికి మరింత విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది.
రాబోయే రెండేళ్లలో డిజిటల్ స్పోర్ట్స్ విభాగంలో ఉపాధి అవకాశాల సంఖ్య రెట్టింపు కానుందని ఫెనటిక్స్ ధీమా వ్యక్తం చేసింది. 80 ప్రాంతాల్లో 22 వేల మంది ఉద్యోగులతో తమ కంపెనీని మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. సంస్థ విస్తరణ కోసం నిబద్ధతతో పనిచేస్తామని స్పష్టం చేసింది.

2026 నాటికి హైటెక్ సిటీలో ప్రస్తుతం ఉన్నదానికంటే సంస్థ విస్తరణ మూడు రెట్లు అధికమవుతుందని ఫెనటిక్స్ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఫెనటిక్స్ కార్యాలయం వైఎస్ ప్రెసిడెంట్ అభిషేక్ ధస్మాన ఈ సందర్భంగా మాట్లాడారు. తమ సంస్థలో ప్రతిభావంతులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ బృందంతో తనను చేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సాంకేతికత, ఏఏఐని ఉపయోగించుకుని తమ సంస్థ భవిష్యత్తును రూపొందించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అభిషేక్ తెలిపారు. సంస్థ విస్తరణ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ క్రీడా అభిమానులను ఆనందపరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు అభిషేక్ తెలిపారు.
ఫెనటిక్స్ ఎఫెక్టివ్ టెక్నాలజీ ప్రాజెక్టులను నడిపిస్తుందని, వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు. 2018లోనే ఫెనటిక్స్ తన మొదటి టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్ నగరంలో ప్రారంభించిందని తెలిపారు. వేలాది మంది క్రీడాకారులను ఈ వేదికపైకి తీసుకొస్తామన్నారు. అంతేగాక, కలెక్టబుల్స్, గేమింగ్ లో ఉత్పత్తుల సేవలను ఫెనటిక్స్ సంస్థ అందిస్తుందని అభిషేక్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications