రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కష్టాలకు చెక్, ఇక నుంచి..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. యూరియా కోసం ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల చుట్టూ రైతన్నల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకింది. రైతులు తమ ఇంటి నుంచే యూరియాను బుక్‌ చేసుకునేవిధంగా ఓ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ విధానంతో యూరియా పంపిణీలో మరింత పారదర్శకత పెరగడంతో పాటు రైతుల కష్టాలు తీరనున్నాయి.

గత సీజన్ లో రైతులకు యూరియా సరిపడా లభ్యం కాకపోవడంతో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. దీంతో, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు సరిపడా యూరియా లభించే విధంగా కొత్తగా బుకింగ్‌ విధానం తీసుకొచ్చింది. ప్రస్తుతం పత్తి పంటలను సాగు చేసిన అన్నదాతలు దాన్ని విక్రయించుకునేందుకు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నట్లుగానే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని యూరియాను ముందస్తుగా ఆ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రైతులకు యూరియాను ఓకేసారి కాకుండా పలు విడతల వారీగా సరఫరా చేయనున్నారు. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో ఐదు నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతన్నలకు మూడు విడతల్లో, 20 ఎకరాలకు మించిన భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియాను బుక్‌ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

farmers-will-be-able-to-book-urea-from-the-comfort-of-their-homes-using-just-a-mobile

ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లో రైతు పట్టాదార్​ పాస్‌పుస్తకం నంబరును నమోదు చేయగానే లింక్‌ అయిన ఫోన్‌ నెంబర్‌కు ఓ ఓటీపీ(వన్​ టైమ్​ పాస్​వర్డ్​) వస్తోంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే రైతుకు చెందిన భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంటకు అవసరమైనటువంటి యూరియా పరిమాణంలో బుకింగ్‌ ఆధారంగా అధీకృత రిటైలర్లు లేదా సహకార సంఘాల ద్వారా యూరియాను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బుకింగ్‌ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు(రెండు రోజులు) మాత్రమే ఉంటుంది. ఈ గడువు తేదీలోగా యూరియా తీసుకోనట్లయితే అది తిరిగి స్టాక్‌లోకి వెళ్తుంది. యాప్​ వినియోగంపై అన్నదాతలకు సమస్యలు ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏఈవో)ను సంప్రదించవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+