ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా చంపిన తండ్రి.. కారణం ఏంటంటే ?
మానవ సంబంధాలు నానాటికీ మంట గలిసి పోతున్నాయి అనే అనుమానం ప్రస్తుతం రేకెత్తుతుంది. క్షణికావేశంలోమనుషులు మృగం లాగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడు లాగా మారిపోతున్న ఘటనలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
క్షణికావేశంతో తండ్రులు తమ పిల్లలను చంపిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ కలహాలు, డబ్బు సమస్యలు, మానసిక ఒత్తిడుల వల్ల కొంతమంది తండ్రులు కిరాతకంగా మారుతున్నారు. ఈ తరహా ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

కొండాపూర్ మండలం మల్కపూర్‌లో సుభాష్.. తన భార్య, పిల్లలు మారిన్(13), ఆరాధ్య(10) తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్ దారుణానికి ఒడిగట్టాడు.
ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య కోసం చిన్నారులను చంపడం ఏంటని స్థానికులు, వారి బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.












Click it and Unblock the Notifications