కన్న తండ్రే కాల యముడై.. కొడుకు, కూతురుకు మాజాలో విషం కలిపి !!

కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న తన ఇద్దరు పిల్లలను విషప్రయోగం చేసి, గొంతు నులిమి చంపేందుకు తండ్రి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం స్థానికులను షాక్‌కు గురి చేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల సమాచారం ప్రకారం..

మల్లేశం-పోచమ్మ దంపతుల అసలు స్వస్థలం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటరావుపేట. ఉద్యోగ సంబంధిత కారణాల వల్ల గత ఏడేళ్లుగా వీరు కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అంత బాగోలేదని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు మల్లేశం తన కొడుకు ఆశ్రిత్, కూతురు అర్చనలకు మజా బాటిల్‌లో విష పదార్థాలు కలిపి ఇచ్చాడు. పిల్లలు విషపూరిత పానీయం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. వారి గొంతును నులిమి చంపేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దారుణం అనంతరం మల్లేశం అక్కడి నుంచి పారిపోయాడు.

father-murder-attempt-on-his-daughter-and-son-at-karimnagar

అయితే పని ముగించుకొని ఇంటికి చేరిన తల్లి పోచమ్మ పిల్లలను అపస్మారక స్థితిలో గమనించడం ఘటనను వెలుగులోకి తెచ్చింది. ఆమె స్థానికుల సహాయంతో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా, కొడుకు ఆశ్రిత్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పిల్లలు పుట్టిననాటినుండే మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వారిని చూసుకోవడంలో వచ్చిన ఇబ్బందులు, పెరుగుతున్న ఖర్చులు, మానసిక ఒత్తిడి మల్లేశాన్ని ఈ ఘోర నిర్ణయం తీసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఇది ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేనని, ఇది పూర్తిగా హత్యాయత్నమేనని పోలీసులు స్పష్టం చేశారు. ఘటన తర్వాత పరారైన మల్లేశం కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. హత్య, హత్యాయత్నం, విషప్రయోగం వంటి పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+