మందుబాబులకు పండుగే... తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. దీంతో హైదరాబాద్లోనూ ఫుట్ బాల్ అభిమానులలో ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ పీక్స్ కు చేరుకుంది. ఈ మెగా టోర్నమెంట్ ముగింపు వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం

పారిశ్రామిక రంగాలకు, క్రీడా అభిమానులకు ఊరట నిచ్చే విధంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ లను వీక్షించే ఫుట్ బాల్ అభిమానులకు బ్రహ్మాండమైన వెసులుబాటు కల్పించింది. ఫిఫా వరల్డ్ కప్ తో పాటు, లిక్కర్ ను కూడా ఎంజాయ్ చేసేలా నిర్ణయం తీసుకుంది. క్లబ్ లు, బార్లు, మైక్రో బ్రూవరీల మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

FIFA World Cup 2026 Revanth govt extends the operating liquor hours in clubs bars microbreweries

ఫుట్ బాల్ అభిమానుల కోసం తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్

ఈ మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభం కానున్న ఈ కీలక మ్యాచ్ లను క్రీడాభిమానులు ఎంజాయ్ చేసేలా, గ్రూపులుగా చేరి మ్యాచ్ లను వీక్షించేలా, అందుకు తగినట్టు సమయాన్ని పెంచాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.

థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, తుదిపోరు కోసం మద్యం అమ్మకాలకు వెసులుబాటు

ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ సందర్భంగా జులై 18వ తేదీ శనివారం రాత్రి నుండి జులై 19వ తేదీ ఆదివారం ఉదయం 4గంటల 30 నిమిషాల వరకు మద్యం అమ్మకాలకు వెసులుబాటు కల్పించింది. అలాగే జులై 19వ తేదీ జరిగే తుదిపోరును పురస్కరించుకొని జూలై 20 సోమవారం తెల్లవారుజామున 3గంటల వరకు బార్లు, క్లబ్ లు, మైక్రో బ్రూవరీస్ తెరిచి ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది.

బుల్లెట్ రైల్ కారిడార్ లపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!
బుల్లెట్ రైల్ కారిడార్ లపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి వచ్చే చోటే ప్రత్యేక సడలింపులు

ఇది కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాలలో గుర్తింపు పొందిన 2b బార్లు, c1 క్లబ్బులు, మైక్రో బ్రూవరీస్ కు మాత్రమే వర్తిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేకసడలింపులు వర్తించవని పేర్కొంది. అయితే ఈ అదనపు సమయాలలో కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎక్సైజ్ శాఖ యొక్క నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఎక్సైజ్ శాఖ అధికారులు యాజమాన్యాలను ఆదేశించారు.

హైదరాబాద్ ను చూస్తే అసూయ.. ఆంధ్రులను కట్టుబట్టలతో పంపారు: లోకేష్ వ్యాఖ్యలపై చర్చ
హైదరాబాద్ ను చూస్తే అసూయ.. ఆంధ్రులను కట్టుబట్టలతో పంపారు: లోకేష్ వ్యాఖ్యలపై చర్చ

మందు బాబులకు శుభవార్త

స్వతహాగా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఫుట్ బాల్ కి ఉన్న క్రేజ్ ను ఈ నిర్ణయం ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేశారు. అయితే ఇదే సమయంలో మందు బాబులకు శుభవార్త చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+