కాంగ్రెస్ విభేదాలు: దిగ్విజయ్ సమక్షంలో దానం, రామ్మోహన్‌ రెడ్డి వాగ్వాదం

తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతల్లో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ వ్వవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్, రామ్మోహన్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతాన్ని గ్రేటర్ పరిధి నుంచి తప్పించాలని రామ్మోహన్‌రెడ్డి కోరారు. ఇదే విషయాన్ని రామ్మోహన్‌రెడ్డి అధిష్టానం పెద్దల ముందు ప్రస్తావించారు. రామ్మోహన్‌రెడ్డి అభ్యర్థనకు దానం నాగేందర్ అభ్యంతరం తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Fight between ex minister Danam Nagender and rammohan reddy

ఇక కాంగ్రెస్ పార్టీ వ్వవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ సోమవారం వరంగల్‌‌లో పర్యటించారు. వరంగల్ ఉపఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

సమావేశం అనంతరం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబాన్ని చూసి కాదని అన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను ఉపఎన్నికలో గెలిపించాలని ఆయన కోరారు.

ఏసీబీ వలలో మంగనూరు వీఆర్‌వో

మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినేపల్లి మండలం మంగనూరు వీఆర్‌వో పర్వతాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 2 వేలు లంచం తీసుకుంటుండగా పర్వతాలును అధికారులు పట్టుకున్నారు.

ఈత కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

ఈత కొలనులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేటకు చెందిన పవన్ (16), ప్రణీత్ (13)లు దసరా సెలవులు కావడంతో జవహర్ నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

స్ధానిక చెరువులో ఈతకు కొట్టేందుకు వెళ్లి మునిగిపోయారు. వీరితో పాటు ఈతకు వెళ్లిన మరో బాలుడు ప్రమాద విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+