• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉపాధి పైసలివ్వకపోతే ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టండి.!బండి సంజయ్ వినూత్న పిలుపు.!

|
Google Oneindia TeluguNews

మహేశ్వరం/హైదరాబాద్ : జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తున్నా చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మాత్రం కూలీలకు సక్రమంగా చెల్లించకుండా వేధిస్తోందన్నారు ఎంపీ, బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఇకపై సక్రమంగా ఉపాధి డబ్బులు ఇవ్వకుంటే బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలని పిలుపునిచ్చారు. 29వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని పులిమామిడిలో గ్రామస్తులతో కలిసి బండి సంజయ్ రచ్చ బండ నిర్వహించారు.

 రచ్చబండి నిర్వహించిన సంజయ్.. ఎన్నో సమస్యలు చెప్పుకున్న ప్రజలు

రచ్చబండి నిర్వహించిన సంజయ్.. ఎన్నో సమస్యలు చెప్పుకున్న ప్రజలు

రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను బండి సంజయ్ కుమార్ కు ఏకరవు పెట్టారు. బస్ చార్జీలు, కరెంట్ చార్జీలు, పెట్రోల్, ఉప్పు, పప్పు, నూనెల ధరలతో పాటు, చివరకు తాగడానికి నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, అర గుంట పొలం ఉన్నోడికి ఇన్సూరెన్స్ ఇస్తున్నారని, మరి ఏ పొలం లెనోళ్ళ పరిస్థితి ఏంటని, పెన్షన్లు రాక, 11 ఏళ్లుగా ఇళ్ళు లేక నరకయాతన అనుభవిస్తున్నామని,తామెట్లా బతకాలి? తన భర్తకి ప్రమాదంలో రెండు కాళ్ళు పోయాయని,పెన్షన్ కూడా రావడం లేదని, మమ్మల్ని మీరే ఆదుకోవాలంటూ స్తానికులు వాపోయారు. వారి బాధలన్నీ విన్న బండి సంజయ్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

 కేసీఆర్ ఎనిమిదేళ్లుగా అబద్దాలు చెప్పారు.. ఇప్పుడు నేతలు నిజాలు చెప్తున్నా నమ్మే పరిస్థితులు లేవన్న సంజయ్

కేసీఆర్ ఎనిమిదేళ్లుగా అబద్దాలు చెప్పారు.. ఇప్పుడు నేతలు నిజాలు చెప్తున్నా నమ్మే పరిస్థితులు లేవన్న సంజయ్


చంద్రశేఖర్ రావు ఎనిమిది సంవత్సరాలుగా అబద్ధాలు చెబుతున్నాడని, అబద్దాలు చెబుతుండడంతో, వేరే రాజకీయ నాయకులు నిజాలు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదన్నారు బండి సంజయ్. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారందరికీ ఎప్పటికప్పుడు కేంద్రం నిధులు చెల్లిస్తోందని, ఎండా కాలంలో ఒక్కొక్కరికి 277 రూపాయలను అందజేస్తోందన్నారు. చంద్రశేఖర్ రావు మాత్రం సకాలంలో డబ్బులివ్వకుండా పేదలను మోసం చేస్తున్నడని, ఇకపై వారం వారం ఉపాధి హామీ పైసలు ఇవ్వకపోతే క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఉపాది హామీ పైసలు కేంద్రం ఇస్తోంది తప్ప చంద్రశేఖర్ రావు అయ్య జాగీరు కాదన్నారు సంజయ్.

 29 రూపాయలు భరిస్తున్న మోదీ గొప్పోడా.? ఒక రూపాయి భరిస్తున్న చంద్రవేఖర్ రావు గొప్పోడా?

29 రూపాయలు భరిస్తున్న మోదీ గొప్పోడా.? ఒక రూపాయి భరిస్తున్న చంద్రవేఖర్ రావు గొప్పోడా?


తెలంగాణలోని పేదలకు 1.4 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే, వాటిని నిర్మించకుండా చంద్రశేఖర్ రావు ప్రజలను మోసం చేస్తున్నడని, హైదరాబాద్ లో 150 కోట్ల విలువైన 4935 గజాల స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టడానికి చంద్రశేఖర్ రావు తీసుకున్నడు. ఆ డబ్బులతో ఇక్కడున్న పేదోళ్లకు ఫించన్లు, ఇండ్లు ఇవ్వొచ్చన్నారు సంజయ్. పేదలకు రెండు డోసుల ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదేనని, పేదలకు 5 కిలోల బియ్యాన్ని మోడీ ఉచితంగా ఇస్తున్నారని, కిలో బియ్యానికి 29 రూపాయలు భరిస్తున్న మోదీ గొప్పోడా.? ఒక రూపాయి భరిస్తున్న చంద్రవేఖర్ రావు గొప్పోడా?అని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్.

 నిఖార్సైన సేవ చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వాలన్న బండి సంజయ్

నిఖార్సైన సేవ చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వాలన్న బండి సంజయ్


నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని, రైతులను ఆదుకోవాలని కొట్లాడితే బీజేపి నేతలను జైళ్లకు పంపిస్తున్నారని, రైతుల కోసం కొట్లాడేందుకు వెళితే, తనపై కూడా రాళ్ళ దాడి చేయించారని, ఐనప్పటికీ భయపడే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం చంద్రశేఖర్ రావుకు తెలిసిన విద్య అని, తెలంగాణలో పేదోళ్ల రాజ్యం వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు బండి సంజయ్. 1400 మంది పేదోళ్లు చనిపోతేనే తెలంగాణ వచ్చిందని, పేదోళ్ల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారని, మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండని ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేసారు.

English summary
MP and BJP president Bandi Sanjay Kumar said that the Chandrasekhar Rao government was harassing the workers by not paying them regularly even though the central government was paying the funds for the National Employment Guarantee Scheme on time. He called for a criminal case against those responsible and sent to jail if they no longer pay their regular employment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X