బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబుకు ఆహ్వానం!

నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 సంవత్సరాలు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా , అత్యంత ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకను సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులను, రాజకీయ రంగ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

చంద్రబాబుకు ఆహ్వానం అందజేత
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.. బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్న వేడుకలో బాలకృష్ణ సమకాలికులతో పాటు ఎంతోమంది సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు ఆహ్వానాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు సినీ రంగ ప్రముఖులు. నేడు హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు.

Film Industry moved for Balakrishna Golden Jubilee celebrations invitation to AP CM Chandrababu

చంద్రబాబును కలిసిన సినీ ఇండస్ట్రీ వర్గాలు
అత్యంత ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్న ఈ ఈవెంట్ కు చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరగనున్న ఈ సెలబ్రేషన్స్ కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించటానికి తెలుగు చిత్ర పరిశ్రమ తరపున తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, తెలుగుఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తదితరులు చంద్రబాబును కలిశారు.

సానుకూలంగా స్పందించిన చంద్రబాబు
ఈరోజు హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సినీ పెద్దలు, ఆయనకు శాలువా కప్పి సత్కరించి, మొమెంటో ఇచ్చి గౌరవించారు. తప్పనిసరిగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని చెప్పారు. ఇక బావమరిది బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని ఇచ్చిన ఆహ్వానంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

సినీ పరిశ్రమపై వారితో చంద్రబాబు చర్చ
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే తాజా పరిస్థితులను, ఇతర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. తప్పని సరిగా వస్తానని చెప్పారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత కె.ఎల్. నారాయణ, నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, అలంకార్ ప్రసాద్, రాజా యాదవ్ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+