చిక్కుల్లో పడ్డ కేటీఆర్- వాళ్లను కూడా
KTR: భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఫార్ములా ఈ- కార్ రేస్‌లో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు మొన్నటివరకు ఆరోపణలు కేసులను ఎదుర్కొన్న కేటీఆర్‌పై కొత్తగా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మన్నెం కృశాంక్, కొంతం దిలీప్ కుమార్‌పైన పోలీసులు కేసులు నమోదు చేశారు.
10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కేటీఆర్ ఆరోపణలు చేయడమే దీనికి కారణమైంది. ఈ నెల 24వ తేదీన దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని కృశాంక్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఎస్ఎల్‌బీసీ పరీక్షా కేంద్రంలో తన వద్ద ఉన్న టెన్త్ ప్రశ్నాపత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫొటో తీసుకున్నాడంటూ ఝాన్సీ లక్ష్మీ అనే విద్యార్థిని ఆరోపించిన వీడియోను షేర్ చేశారు.

పేపర్ లీక్ కేసులో కాంగ్రెస్ నాయకులు వొగ్గిడి శ్రీనివాస్, చిట్ల ఆకాష్, బండి శ్రీను, గునుగుంట్ల శంకర్‌కు ప్రమేయం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోలను కృశాంక్ పోస్ట్ చేశారు. ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్‌తో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని, ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించారని విమర్శించారు.
🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings -
— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025
Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups...
While 15 people have been involved,
only 6 have been… pic.twitter.com/XHBScJBrY7
ఈ పోస్ట్- తాజాగా కేటీఆర్, కృశాంక్, కొంతం దిలీప్ కుమార్‌పై కేసులు నమోదు కావడానికి కారణమైంది. చిట్ల ఆకాష్ అనే వ్యక్తిపై చౌగోని రజిత నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా కేటీఆర్, ఇతర నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 353 (1) (సీ), 353 (2) కింద వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్‌లో వరుసగా మన్నెం కృశాంక్ బీఆర్ఎస్ నాయకుడు కావడం, ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు కేటీఆర్, కొంతం దిలీప్ కుమార్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కావడం వల్ల వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications