శంషాబాద్‌లో 5కిలోల బంగారం పట్టివేత, ప్రయివేటు బస్సులో వెండి మూటలు
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఐదు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి ఈ బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారు హైదరాబాదుకు చెందినవారీగా గుర్తించారు.
ప్రయివేటు ట్రావెల్ బస్సులో వెండి
ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సులో వెండి లభ్యమైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మాత్రం ప్రయాణికులు, వారి లగేజీతో పాటు వెండి మూటలు ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో ఎక్సైజ్ శాఖ పోలీసుల వాహనాల తనిఖీల్లో ఈ కొత్త తరహా స్మగ్లింగ్ వెలుగు చూసింది. కొత్తగా కనిపించిన మూటలు విప్పి చూసిన ఎక్సైజ్ శాఖ పోలీసులకు అందులో వెండి ముద్దలు కనిపించాయి.
మూటల్లో వెండి ముద్దలు చూసి షాక్ తిన్న పోలీసులు వాటిని తూకం వేయగా, వాటి బరువు 60 కిలోలుగా ఉందని తేలింది. బెంగళూరు నుంచి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మార్గాల్లో ఈ వెండి హైదరాబాద్‌కు తరలివస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.
పాతబస్తీలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అర్థరాత్రి నుంచి హఫీజ్ బాబానగర్, బహదూర్‌పురా, కాలాపత్తార్‌లో సోదాలు నిర్వహించారు. దాదాపు 430మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications