ఐదువేల ఏండ్ల మర్రీ: ఏడుఎకరాల్లో ఒకే చెట్టు విస్తీర్ణం
ఆ మర్రీ చెట్టు విస్తీర్ణంలో ఏడు ఎకరాలు, కొలిసినవారికి కొంగుబంగారంగా పెరొందిన అమ్మవారి గుడి. పిల్లలు,పెద్దలు ఆదివారాల్లో పిక్నిక్ వస్తువెల్తున్న పర్యాటక కేంద్రం, పక్కనె గోదావరి తీరం, ఇలా చెప్పుకుంటు
కరీంనగర్: ఆ మర్రీ చెట్టు విస్తీర్ణంలో ఏడు ఎకరాలు, కొలిసినవారికి కొంగుబంగారంగా పెరొందిన అమ్మవారి గుడి, పిల్లలు,పెద్దలు ఆదివారాల్లో పిక్నిక్ వస్తువెళ్తున్న పర్యాటక కేంద్రం,ఏడు ఎకరాల్లో రెండు ఆలయాలు,శుక్రవారం అమ్మవారు, దుర్గామాత అమ్మవారు, చుట్టు పచ్చని వాతావరణం, పక్కనె గోదావరి తీరం, ఇలా చెప్పుకుంటు వెళితె ఆ మర్రీ చెట్టు అన్నీ ప్రత్యేకతలు సంతరించున్నాయి...
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ శివారులో ఉన్న ఈ మర్రీ ఆసియా ఖండంలోనె అతి పెద్ద మర్రీగా ప్రసిద్దిగాంచింది.పూర్వికులు ప్రకారం ఈ మర్రీ సుమార్ ఐదువేళ సంవత్సరాల క్రితం నుండి ఉందని చెపుతారు.

లక్ష్మిఅమ్మవారు సాక్షాత్తు వెలిసింది కాబట్టి లక్ష్మిదేవి అమ్మవారి చెట్టుగా పిలుస్తారు.చెట్టు ఖాండం ఒకటె కానీ ఊడలతో విస్తరించి ఏడు ఎకరాలకు చేరుకుంది, ప్రతి శుక్రవారం ఇక్కడికి, నిజామాబాదు, ఆదిలాబాదు,ముంబై, బీవండీ, పుణె లాంటి మహానగరాలనుండి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
ఓ వైపి దుర్గామాత అమ్మవారి ఆలయం, మరొవైపు శుక్రవారము అమ్మవారి ఆలయం ఉండటం వల్ల భక్తులకు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తారు.ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ మర్రీకి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఇక్కడి మర్రీ చెట్టు ఆకులను ఎవరు తెంపరు, ఎందుకంటే అది తరతరాలనుండి వస్తున్నా ఆచారం, ఇక్కడి పత్యేకతలు దృష్టి లో పెట్టుకోని గ్రామస్తులు ఈ చెట్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలని ఎంతో శ్రమించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఉన్నప్పుడు, పర్యాటక కేంద్రంగా ఏర్పాటు కు సిద్దం చేశారని చెప్పారు కానీ ఇప్పటికి ఆ ఊసె లేదు, ఇక్కడ ఆలయాలు నిర్మించాలనె ఉద్దెశంతో గ్రామస్తులు, విరాళాలు సేకరించి సుమార్ ఇరువై లక్షలతో దుర్గామత, శుక్రవారము అమ్మవారి ఆలయం నిర్మించారు, కానీ ఇప్పటికి ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాలేవు, వేసవికాలంలో పిక్నిక్ స్పాట్ గా, పిల్లలు పెద్దలు వచ్చి రోజంతా గడుపుతారు.

ఇప్పుడు శరన్నవరాత్రోత్సవాలు ఆరంభం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు...తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్దాకా,ఈ మర్రీని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలని గ్రామాస్తులు పలుమార్లు మంత్రులకు, ఎమ్మెల్యే లకు విన్నవించుకున్న ఫలితం లేదు, ఇలాంటి అరుదైన ప్రకృతి సంపదను గుర్తించి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని ఇక్కడివారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications