విస్తుపోయే నిజాలు: మాజీ డీఎస్పీతో లింక్, నయీం సంరక్షణ బాధ్యత ఏసీపీకి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో ఒక మాజీ డీజీ, ఇద్దరు డీఎస్పీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ డీజీ, ఇద్దరు డీఎస్పీలు కొద్దినెలల క్రితం వరకూ కూడా సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
మాజీ డీజీ తన సొంత వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు అప్పుడప్పుడూ నయీం అనుచరులకు ఫోన్లు చేస్తుండగా.. డీఎస్పీలు మాత్రం నేరుగా నయీంతో మాట్లాడ్డంతో పాటు భూవివాదాలు, సెటిల్‌మెంట్ల గురించి చర్చించుకునేవారని తెలుస్తోంది.
శంషాబాద్‌లో 'కొత్త' డెన్, మారువేషాల్లో నయీం!: యాదాద్రిపై కన్నుఈ మేరకు ఇద్దరు డీఎస్పీల చరవాణుల నంబర్లను దర్యాప్తు అధికారులు సేకరించినట్టు తెలిసింది. సదరు మాజీ డీజీ గతంలో ఓ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోగా, ఇద్దరు డీఏస్పీల్లో ఒకరు నయీం సొంత జిల్లాలో నాలుగేళ్ల పాటు పని చేసినట్టుగా తెలుస్తోంది. ముగ్గురి పాత్రపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.
నయీం మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు మాజీ డీజీ అప్పట్లో డీఐజీగా విధులు నిర్వహిస్తుండేవాడని, మావోయిస్టుల సమాచారాన్ని చేరవేసే ఇన్‌ఫార్మర్‌గా నయీం పరిచయం కావడం, ఆపై అది వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచినట్లుగా తెలుస్తోంది.
నాలుగేళ్ల వ్యవధిలో మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు మట్టుబెట్టడానికి కీలకంగా మారింది నయీం ఇచ్చిన సమాచారమేనని అంటున్నారు. తాను నయీంను ఇన్‌ఫార్మర్‌గా ఉంచుకున్నానంటూ డీఐజీ హోదాలో ఆయన ప్రభుత్వానికి వివరించాడు.

అనంతరం ఆయనకు ఐజీగా, అదనపు డీజీగా పదోన్నతి లభించినా నయీంతో సంబంధాలు వదులుకోలేదు. నయీం గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడం, భూవివాదాలు, సెటిల్‌మెంట్లు చేస్తుండడంతో తనకు కూడా ఆస్తులు సంపాదించి పెట్టమని కోరాడు. సదరు అధికారికి నయీం భూములు కొనడం మొదలుపెట్టాడు.
నయీంతో సంబంధాలున్న ఇద్దరు డీఎస్పీలకు పదోన్నతులు పరోక్షంగా అతగాడి వల్లే లభించాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న ఈ అధికారుల్లో ఒకరు.. ఎస్సైగా, ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు నయీం ఇచ్చిన సమాచారంతో నల్గొండ జిల్లాలో వరస ఎన్ కౌంటర్లు చేశాడు.
డైరీ ఎఫెక్ట్, ప్రముఖులపై నిఘా: బంధువుపై నయీం ఫైర్, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యడీఎస్పీగా పదోన్నతి వచ్చింది. అనంతరం రంగారెడ్డి జిల్లాకు పోస్టింగ్ ఇప్పించుకున్నాడు. అక్కడ నయీం సెటిల్‌మెంట్లకు సహకరించాడు. అనంతరం మరోసారి పోస్టింగ్ సంపాదించుకున్నాడు. డీఎస్పీగా ఉన్నంత కాలం ఓ ప్రజాప్రతినిధి బంధువు సెటిల్‌మెంట్లకు సహకరిస్తూనే.. నయీం గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చేవాడు. ఫలితంగా అక్కడ విలువైన సుమారు 260ఎకరాల భూములను నయీం గ్యాంగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ డీఎస్పీ హైదరాబాద్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది.
నయీం ఎన్ కౌంటర్, అతని డైరీల చిట్టా నేపథ్యంలో సదరు ఖాకీ బాస్ పీకల్లోతు లావాదేవీల్లో మునిగినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. నయీంతో సంబంధాలు ఉన్నవారు పరస్పర ప్రయోజనాలతో ఆస్తులు, అంతస్తులు సంపాదించారు.
ఓ సమయంలో నయీంను నియంత్రిద్దామని కీలక ఐపీఎస్ అధికారి చెప్పినప్పటికీ.. అతడినే పోస్టు నుంచి తొలగించాడని తెలుస్తోంది. సాంబశివుడి లొంగుబాటును అడ్డుకునే ప్రయత్నం చేశాడని, ఎన్‌కౌంటర్ చేయాలని నాడు తీవ్ర ఒత్తిడి చేశాడని, కానీ కేంద్ర హోంకార్యదర్శి జోక్యంతో సమస్య కొలిక్కి వచ్చిందంటున్నారు. తెలంగాణ ఆవిర్బావం తర్వాత నయీం సంరక్షణ బాధ్యతను ఓ ఏసీపీకి అప్పగించారట.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications