డైరీ ఎఫెక్ట్, ప్రముఖులపై నిఘా: బంధువుపై నయీం ఫైర్, పోలీసులపై తీవ్ర వ్యాఖ్య

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం బావ ఫయీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయీం రెండు గ్యాంగులను మెయింటెయిన్ చేసిన విషయం తెలిసిందే. బావ నయీం గ్యాంగ్ బాధితులతో మాట్లాడి, ప్రాథమిక బెదిరింపులకు దిగితే, రెండో గ్యాంగ్ హతమార్చేది.

ఫయీంది మొదటి గ్యాంగ్. అతను మాట్లాడి, బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసేవాడు. నయీం మృతి నేపథ్యంలో ఫయీం కనిపించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు ఫయీం కూడా ఓ గ్యాంగ్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, ఫయీం డ్రైవర్, సన్నిహితుడు శ్రీధర్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం ఇంట్లో దొరికిన ఆస్తుల చిట్టా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు డ్రైవర్ శ్రీధర్ ఇంట్లో సోదాలు చేశారు. వనస్థలిపురం సహేత్‌నగర్ భావనా ఎన్‌క్లేవ్స్‌లో శ్రీధర్ ఇంట్లో రూ.38 లక్షల నగదు, మూడు తుపాకులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

కోర్టులో హాజరుపర్చండి

తన భర్తను కోర్టులో హాజరుపర్చాలంటూ శ్రీధర్ గౌడ్ భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో శ్రీధర్ గౌడ్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

పది బృందాలుగా..

కేసును సిట్‌కు అప్పగించిన నేపథ్యంలో పది బృందాలుగా విడిపోయిన అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ జిల్లా సహా పలు ప్రాంతాల్లో నయీం అనుచరుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. అటు స్వాధీనం చేసుకున్న ల్యాండ్ డాక్యుమెంట్ల ఆధారంగా వాటి యజమానుల వద్దకు వెళ్లి పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

అనుచరుల కస్టడీ

అనుచరుల కస్టడీ

గ్యాంగ్‌స్టర్‌ నయీం అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. నయీమ్‌ అక్రమాస్తుల చిట్టా రోజు రోజుకూ పెరుగుతోంది. నయీం అనుచరులు ఫర్హానా, అఫ్సాను 3 రోజుల పోలీసు కస్టడీకి రాజేంద్రనగర్‌ కోర్టు అనుమతించింది. దీంతో వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సోదాలు

సోదాలు

కోర్టు అనుమతితో పుప్పాలగూడలోని నయీం నివాసం రెండో అంతస్తులోని గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

 రియాజ్ అరెస్ట్

రియాజ్ అరెస్ట్

హైదరాబాద్‌ శివారులో నయీం అనుచరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. వస్థలిపురంలో అదుపులోకి తీసుకున్న శ్రీధర్ గౌడ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో నయీం అనుచరుడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు.

విచారణ

విచారణ

రియాజ్‌ను నల్గొండ తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.సరూర్‌నగర్‌, మన్సూరాబాద్, ఆదిభట్లలో నయీం భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు.

డైరీ ఆధారంగా ప్రముఖులపై నిఘా

డైరీ ఆధారంగా ప్రముఖులపై నిఘా

నగర శివారులో నయీం బినామీల పేరిట భారీగా భూములున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పలువురు ప్రముఖలపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.

 బంధువులపై నయీం ఆగ్రహం

బంధువులపై నయీం ఆగ్రహం

సంపాదించింది చాలు, పోలీసులకు లొంగిపోదామని చెప్పిన తన సమీప బంధువుపై నయీం అలియాస్ బాలన్న ఒకానొక సందర్భంలో మండిపడ్డట్లుగా తెలుస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితం హైదరాబాద్ తుక్కుగూడలోని నయీం ఫాం హౌజ్ లో అతనికి, అతని సమీప బంధువుకు మధ్య జరిగిన సంభాషణ ఇది అని పోలీస్ విచారణలో బయటపడినట్లుగా తెలుస్తోంది.

 బంధువులపై నయీం ఆగ్రహం

బంధువులపై నయీం ఆగ్రహం

'భాయ్, ఎప్పటికైనా పోలీసుల చేతికి దొరకాల్సిందే. చుట్టూ ఆయుధాలతో ఎన్నాళ్లు బతుకుదాం.పోలీసులకు లొంగిపోయి, చేసిన నేరాలు ఒప్పేసుకుందాం. ఆ తర్వాత డబ్బులు ఖర్చుపెట్టి బెయిల్ తెచ్చుకుందాం. ఉన్న ఆస్తులతో జీవితాన్ని గడుపుదాం'ని నయీం బంధువు ఒకరు సలహా ఇచ్చాడని, అతని మాటలకు నయీం ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

బంధువులపై నయీం ఆగ్రహం

బంధువులపై నయీం ఆగ్రహం

చాలామంది పోలీసులు ఒక్కటైనా తనను పట్టుకోలేరని, తన ముందుకు పోలీసులు రాలేరని, తానిచ్చే సమాచారంతోనే పోలీసుల రోజులు గడుస్తున్నాయని, తనిచ్చే డబ్బులతోనే వారు జల్సాలు చేస్తున్నారని అన్నాడని తెలుస్తోంది. రెండు నెలలు ఓపిక పడితే, ఈ దేశాన్ని వదిలిపెట్టి దుబాయి పోదామని, అక్కడి నుంచే కొత్త కంపెనీనీ మొదలు పెడదామని నయీం చెప్పాడని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+