శంషాబాద్‌లో 'కొత్త' డెన్, మారువేషాల్లో నయీం!: యాదాద్రిపై కన్ను

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం గురించి తవ్వే కొద్ది ఎన్నో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, శంషాబాద్‌లో నయీం డెన్ ఒకటి వెలుగు చూసింది. శంషాబాద్ విమానాశ్రయ పరిధిలోని ఓ ట్రిపుల్ బెడ్ రూం ఇంటిలో కుటుంబంతో కలిసి అతను ఏడాది, రెండోళ్లు ఉన్నాడని తెలుస్తోంది.

నయీం డైరీలో వీఐపీలు వీరే! ఏపీలో కలకలం, ఎవరా ఇద్దరు ఐపీఎస్‌లు?గత ఏడాది ఏప్రిల్ నెలలో అతను అక్కడి నుంచి అలకాపురికి వచ్చాడని సమాచారం. సమాచారం మేరకు.. విమానాశ్రయ సమీపంలోని నిర్మానుశ్య ప్రాంతంలో చాలా రోజులు ఉన్నాడు. కానీ అక్కడ నయీం, అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా ఎవరికీ తెలియదు.

ఆ ఇంటిని కబ్డా చేసి తన పేరున రాయించుకున్నాడు. అది ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్. ఆ ప్లాట్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. మంగళవారం నాడు పోలీసులు ఈ ప్లాట్‌కు వచ్చి తనిఖీలు నిర్వహించారు.

Police found Nayeem's den in Shamshabad.

గోడల పైన తుపాకీ బొమ్మలు

ఈ ట్రిపుల్ బెడ్ రూం ప్లాటులో గోడల పైన అక్కడక్కడా తుపాకీ బొమ్మలు ఉన్నాయి. నయీం అందులో ఉన్నాడని చెప్పేందుకు మరిన్ని ఆధారాలు కూడా పోలీసులకు లభ్యమైనట్లుగా తెలుస్తోంది.

యాదాద్రి పైన కన్ను

యాదాద్రి (యాదగిరిగుట్ట) అభివృద్ధి నేపథ్యంలో నయీం దాని పైన కన్నేసినట్లుగా తెలుస్తోంది. యాదాద్రిని తిరుపతి తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అభివృద్ధిని కూడా సొమ్ము చేసుకోవాలని నయీం భావించాడని తెలుస్తోంది.

భయంభయంగా గడిపిన నయీం, పసిగట్టే కుక్కలు, పక్కా 'చిట్టా'తో బెదిరింపుకాగా, నయీం గతంలో ఓ ప్రజాప్రతినిధిని బెదిరించి రూ.50 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సదరు నేత వాయిస్ రికార్డు చేసి మరో ముఖ్య నేతకు వినిపించాడని తెలుస్తోంది. నయీం విగ్గులతో మారు వేషాల్లోను సంచరించేవాడని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+