• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భయంభయంగా గడిపిన నయీం, పసిగట్టే కుక్కలు, పక్కా 'చిట్టా'తో బెదిరింపు

|

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం తాను భయపడుతూ.. ఇతరులను భయపెట్టాడు. అతనిని ప్రాణ భయం వెంటాడింది. ప్రాణభయంతో కంటినిండా నిద్ర లేకుండా, భోజనం చేసే సమయంలోను అతను ఆందోళనగా ఉండేవాడని తెలుస్తోంది. రూ.కోట్లు కొల్లగొట్టినా ఇంట్లో మాత్రం మామూలు సౌకర్యాలే ఉన్నాయి.

ఖరీదైన వాహనాల్లో మాత్రం ప్రయాణించేవాడు. పుప్పాలగూడాలోని నయీం ఇంటిని చూస్తే ఆయన సాధారణ జీవితం గడిపినట్లుగా కనిపిస్తోంది. తాను నివాసముండే భవనాల్లో బయటి వ్యక్తులు ఎవరూ లోనికి ప్రవేశించకుండా గట్టి ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ లోపల అదనపు సౌకర్యాలు లేవు.

మనుషుల పట్ల నిర్దయగా వ్యవహరించే నయీం తన ఇంట్లో ఉన్న కుక్కల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో నయీంను కాల్చి చంపిన అనంతరం పోలీసులు పుప్పాలగూడాలోని నయీం ఇంట్లో సోదాలు నిర్వహించారు.

Nayeem

నాలుగు అంతస్తుల ఆ భవనం బయట నుంచి చూస్తే కట్టుదిట్టంగా ఉంది. ఇతరులెవరూ లోనికి ప్రవేశించకుండా నయీం ఎక్కడికక్కడ బలమైన ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భవనాన్ని నయీం భార్య పేరుతో కొనుగోలు చేశాడు. పక్కన మరో భవనాన్ని కూడా బలవంతంగా తక్కువ ధరకు కొనుక్కున్నాడు. అందులో వాహనాలు పార్క్‌ చేసుకుంటున్నాడు.

సోదాల సందర్భంగా పోలీసులు ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. ఆ సమయానికి ఇంట్లో ఇద్దరు యువతులు, 9 మంది చిన్నారులున్నారు. ఒక పక్క ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే మరోపక్క ఇద్దరు యువతులను ప్రాథమికంగా విచారించారు. పిల్లలతో కూడా మాట్లాడారు.

వారు చెప్పిన వివరాల ప్రకారం నయీం అనుక్షణం భయంభయంగా బతికేవాడని తేలింది. ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళ్తాడో తెలియదని వారు చెప్పారని తెలుస్తోంది. సరిగా తిండి తినేవాడు కాదని, ఎవరో తరుముతున్నట్లు బతికేవాడని చెప్పారని తెలుస్తోంది.

నయీం వేల కోట్లు కొల్లగొట్టాడు. దీంతో విలాసవంతమైన జీవితం గడిపాడని భావిస్తారు. కానీ అతను సాధారణ జీవితం గడిపాడు. మామూలు కుర్చీలు, చిన్న టీవీలు మాత్రమే ఉన్నాయి. ఇల్లు చిందరవందరగా ఉంది. వంటగదిలో వండిన పదార్థాలు, అంతకుముందు రోజువి కూడా కొన్ని ఉన్నాయి. కాగా, నయీం అమ్మాయిల రవాణా చేసినట్లుగా కూడా అనుమానాలున్న విషయం తెలిసిందే.

కాగా, నయీం తన ఇంట్లో డాల్మటైన్‌ జాతికి చెందిన రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. వీటికి శాండో, కోమి అని పేర్లు పెట్టాడు. ఈ రెండు కుక్కలను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని బోన్లలో పెట్టాడు. వీటికి ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆహారంమివ్వాలి, ఎలాంటి మందులు వేయాలనే విషయాలను ఒక కాగితంపై రాసి బోను వద్ద అంటించాడు.

ప్రత్యర్థుల నుంచి ముప్పు వూహించుకుంటూ అనుక్షణం భయం భయంగా బతికే నయీం తన రక్షణ చర్యల్లో భాగంగానే డాల్మటైన్‌ జాతి శునకాలను పెంచుకుంటున్నాడని భావిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు తారసపడ్డా ఇట్టే పట్టేస్తాయి. అలానే పాములు, తేళ్ళ వంటివి కనిపించినా పెద్దగా అరుస్తాయి.

నయీం స్థిరాస్తులే రూ.4వేల కోట్లు

నయీం స్థిరాస్తులే రూ.4వేల కోట్ల వరకు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గోవా, ముంబై, రాయపూర్‌లలో ఖరీదైన ప్లాట్లు ఉన్నాయి. గోవా, రాయపూర్‌లలోని ఇళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో రూ.5కోట్ల విలువైన ప్లాట్, చత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్లో రెండు ఇళ్లను గుర్తించారు. విందులు, విలాసాలకు ప్రాధాన్యం ఇచ్చే నయీం తరుచూ గోవా వెళ్లేవాడు.

అనారోగ్యం కారణంగా తొమ్మిదేళ్ల క్రితం కేరళ వెళ్లిన నయీం త్రివేండ్రానికి 50కిలోమీటర్ల దూరంలో ఫాంహౌస్‌ను కొనుగోలు చేశాడు.

పక్కా ప్లాన్‌తో..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారుల చరిత్రలు, స్థిరాస్తి వ్యాపారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యులైన ప్రజా ప్రతినిధుల వివరాలను నయీం సేకరించాడు. వ్యాపారులకు సంబంధించిన వివరాలనూ సేకరించాడు.

రూ.కోట్లు సంపాదిస్తున్న స్థిరాస్తి వ్యాపారి, లేదా ప్రజాప్రతినిధి పదేళ్ల క్రితం ఎలా ఉండేవాడు? పదేళ్లలో ఆస్తులను ఎలా కూడగట్టాడు? ఎక్కడ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు? అన్న వివరాలు సేకరించేవాడు.

సదరు ప్రజాప్రతినిధి లేదా రియల్‌ వ్యాపారిని లక్ష్యంగా చేసుకోవడం, బెదిరించడం, మాట వినకపోతే ఫలానాచోట చేసిన అక్రమాలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటివి చేసేవాడు. కొందరు పోలీసు అధికారుల పరోక్ష సహకారంతో నయీం గత రెండేళ్లలో 18 మంది ప్రజాప్రతినిధులు, 220 మంది స్థిరాస్తి వ్యాపారులను బెదిరించాడు.

English summary
Police raids on multiple hideouts of Nayeemuddin in the state on Monday yielded crores of rupees, a set of girls suspected to have been used either as human shields or for trafficking, two AK-47 rifles and a huge cache of explosives and firearms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X