ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

ఇటీవలికాలంలో గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నగరాల్లో నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సమయం లేక.. ఒకవేళ ఉన్నా వంట వండే ఓపిక లేక.. ఎక్కువ మంది ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీకి బాగా అలవాటు పడిపోయారు. ఆన్ లైన్ లో ఏది ఆర్డర్ పెట్టినా నిమిషాల్లోనే వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఫుడ్ దగ్గర్నుంచి.. సరుకులు, ఆహార పదార్థాలు.. కూరగాయలు ఇలా అన్నీ ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టడం అందరికీ అలవాటు అయిపోయింది. ఈ క్రమంలోనే జొమాటో, స్విగ్గి, జెప్టో, ఊబర్ ఈట్స్, ఇన్ స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ఇలా అనేక సైట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి ప్రజలు కూడా అన్నీ ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి.. డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేస్తున్నారు.. ఇంక బయటకు వెళ్లడం ఎందుకు అని ఈ యాప్స్ నే వినియోగిస్తున్నారు. అయితే టైమ్ కు తిన్నామా.. రుచికరంగా ఉందా అనే ఆలోచన తప్ప క్వాలిటీ గురించి ఎవరూ అంతగా పట్టించుకోవట్లేదు.

ఈ క్రమంలో ఆన్‌ లైన్‌ లో ఆర్డర్ చేసుకునే హైదరాబాద్ నగరవాసులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ పథ్తర్ గట్టి ప్రాంతంలో ప్రముఖ ఆన్‌ లైన్ డెలివరీ సంస్థ 'ఇన్‌ స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' కు చెందిన గోదాంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన పదార్థాల దుస్థితిని చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గోదామ్ లో పెద్ద ఎత్తున కాలం చెల్లిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే కట్ చేసి ఉన్న ఫ్రూట్స్, ఐడీ ఇడ్లీ- దోశ పిండి, హ్యాపిలో కాజు అలాగే నందిని నెయ్యి లాంటి ఎక్స్ పైర్ అయిన పదార్థాలు చూసి అధికారులు షాక్ అయ్యారు.

Food safety inspections in Hyderabad have exposed the irregularities at Instacart videos goes viral

వీటిని ఆర్డర్ పెట్టుకున్న వినియోగదారులకు చేరవేస్తున్నారు. తద్వారా వాళ్లు అనారోగ్యానికి గురవుతున్నారు. అంతేకాక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ను తుంగలో తొక్కి అప్పటికే కుళ్లిపోయిన వంకాయలు, ఇతర కూరగాయలు, లీక్ అవుతూ మురికి పట్టిన పాల ప్యాకెట్స్.. ఉబ్బిపోయిన టెట్రా ప్యాక్ ‌‌లు కనిపించాయి. వీటితోపాటు ఫ్రిజ్ లో అప్పటికే కరిగిపోయి లీక్ అయి ఉన్న చీజ్, పాలు, ఐస్ క్రీమ్ లు దర్శనమిచ్చాయి. ఇక గోదాంలో కనీస పరిశుభ్రతను కూడా పాటించడం లేదు. అలాగే ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసినట్లు ఎలాంటి రికార్డులను కూడా నిర్వహించడం లేదు. ఇక ఈ వ్యర్థాలను స్పాట్ లోనే ధ్వంసం చేశారు అధికారులు. తక్షణమే లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+