హైదరాబాద్ లో రామేశ్వరం కేఫ్ కు ఝలక్, దెబ్బకు కిచెన్ లో ఏం జరిగిందంటే ?

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ బ్రేక్‌ఫాస్ట్ జాయింట్‌లలో ఒకటైన రామేశ్వరం కేఫ్‌కు చెందిన హైదరాబాద్ అవుట్‌లెట్‌పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ సమయంలో అనేక ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు వెలుగు చూడటంతో రామేశ్వరం కేఫ్ యాజమాన్యంతో పాటు కస్టమర్లు ఉలిక్కిపడ్డారు.

హైదరాబాద్ లో రామేశ్వరం కేఫ్ పై ఆహార భద్రతా శాఖ అధికారులు దాడులు చేసిన విషయంపై రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకులు దివ్యా రాఘవేంద్రరావు స్పందించారు. మా హైదరాబాద్ అవుట్‌లెట్‌లో అధికారులు చేసిన పరిశీలన వివరాలను మేము గుర్తించామని, కస్టమర్లకు సేవ చెయ్యడానికి, నాణ్యమైన ఆహారం అందివ్వడానికి, పరిశుభ్రత విషయంలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని, కస్టమర్ భద్రత మా మొదటి ప్రాధాన్యత అని మేము మీకు హామీ ఇస్తున్నామని అన్నారు.

Food safety officials searched Rameswaram Cafe in Hyderabad and seized food items

మేము ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము అని దివ్యా రాఘవేంద్రరావు అన్నారు. హైదరాబాద్ రామేశ్వరం కేఫ్ లో జరిగిన వాస్తవాలను ధృవీకరించడానికి, ప్రతి అవుట్‌లెట్ స్టాక్‌ను తనిఖీ చేయడానికి మేము అంతర్గత దర్యాప్తుకు ఆదేశించామని, ఈ విషయంలో అధికారులకు మేము పూర్తి సహకారాన్ని అందిస్తాయని దివ్యా రాఘవేంద్రరావు కస్టమర్లకు హామీ ఇచ్చారు.

మా హైదరాబాద్ రామేశ్వరం కేఫ్ అవుట్‌లెట్‌లోనే మాకు వారానికి ఉద్దిపప్పు 500 కేజీల కంటే ఎక్కువ అవసరం అని, ప్రతిరోజు 300 లీటర్ల పాలు, రోజుకు 80 నుంచి 100 లీటర్ల పెరుగు అవసరం అని దివ్యా రాఘవేంద్ర రావు అంటున్నారు. అయితే మేము గౌడన్ లో నిల్వలు ఉంచుకున్న ఆహారపదార్దాలు ఉపయోగించుకోవడానికి కాదని, రామేశ్వరం కేఫ్ పై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ దాడులు చేశారని, మేము అన్ని చట్టాలను అనుసరిస్తామని దివ్యా రాఘవేంద్ర రావు అంటున్నారు.

Food safety officials searched Rameswaram Cafe in Hyderabad and seized food items

విక్రేతల నుండి మంచి నాణ్యమైన ఉత్పత్తులను తీసుకుంటామని, లేబుల్ లేని ఉత్పత్తుల వినియోగాన్ని చట్టం నిషేధించలేదని, మేము అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నామని దివ్యా రాఘవేంద్ర రావు అన్నారు. రామేశ్వరం కేఫ్‌లో బొద్దింకలు కనిపించలేదని, మా వంటగదిలో బొద్దింకలు కనిపించాయని కొన్ని నివేదికలు తప్పుగా చెబుతున్నాయని, అధికారిక నివేదికలో ఈ ప్రస్తావన లేదని, నిజానికి బొద్దింకలు మరో రెస్టారెంట్‌లో కనిపించాయని, రామేశ్వరం కేఫ్‌లో కాదని దివ్యా రాఘవేంద్ర రావువ అంటున్నారు.

మా కేఫ్‌లో ప్రతిరోజూ డీప్ క్లీనింగ్ ఉంటుందని, ఆహార నాణ్యతను కొనసాగిస్తామని దివ్యా రాఘవేంద్ర రావు అన్నారు. ప్రస్తుతం మాకు తెలంగాణ అధికారుల నుండి ఎటువంటి షోకాజ్ నోటీసు రాలేదని, వారి విచారణకు మా పూర్తి సహకారాన్ని అందిస్తామని మేము హామీ ఇస్తున్నామని దివ్యా రాఘవేంద్ర రావు చెప్పారు. మేము మా అన్ని అవుట్‌లెట్‌లలో పారిశుద్ధ్య తనిఖీలను ఆదేశించామని వివరించారు.

మంచి నాణ్యతను అందిస్తామని మేము ఎల్లప్పుడూ నమ్ముతున్నామని, మా కస్టమర్ల హృదయాలను గెలుచుకోవడానికి ఆహారం మరియు సేవ చాలా ముఖ్యం అని రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకులు దివ్యా రాఘవేంద్రరావు, రాఘవేంద్రరావు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ రామేశ్వరం కేఫ్‌లో రూ.16,000 విలువైన 100 కిలోల ఉద్దిపప్పు, 10 కిలోల నందిని పెరుగు, ఎనిమిది లీటర్ల పాలు వంటగదిలో లభించాయి. హైదరాబాద్ రామేశ్వరం కేఫ్‌లో లేబుల్ లేని 450 కిలోల బియ్యం, 20 కిలోల తెల్ల అలసందలు, 300 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరం కేఫ్‌లోని డస్ట్‌బిన్‌లు మూతలతో కప్పబడలేదని తెలంగాణ ఆహార భద్రతా విభాగం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+